సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.
హరీశ్‌రావు ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..
- రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాం
- సిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యింది
- కేవలం 350 మంది రైతులకే
- రుణమాఫీ పై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారు
- మాట తప్పింది రేవంత్‌రెడ్డి
- నాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు
- రేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ?
- రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డి
- అధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు
- ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు
- రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు
- రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలి
- నీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదు
- సాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావు
- రేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపు
- బూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు
- పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు
- దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న
- అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న
- దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా
- ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు
- రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో
- భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు
- రేవంత్ గాడ్ ఫాదర్‌లకే భయపడలేదు
- చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు
- రైతుల పక్షాన పోరాటం చేస్తాం
- రుణ మాఫీ పై బీఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment