మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వం వద్దు | dont neglect works of mission kakatiya: harishrao | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వం వద్దు

Published Wed, Apr 22 2015 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

dont neglect works of mission kakatiya: harishrao

సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల్లో అధికారులు ఎక్కడా అలసత్వం వహించరాదని నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అటవీశాఖ వారితో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ హెల్ప్‌లైన్ పనితీరుపై ఆరా తీస్తూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.  రోజువారీ ఫిర్యాదులను తన వద్దకు పంపాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement