ఎడపల్లి : మండలంలోని సాటాపూర్ గేటు వద్ద బిక్కుంట చెరువులో మిషన్ కాకతీయ పనులను టీఆర్‌ఎస్ మండల నాయకులు గురువారం అడ్డుకున్నారు. గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని, ట్రెంచ్ కటింగ్ చేయకుండానే 20 రోజుల నుంచి రెండో విడత మిషన్ కాకతీయ భాగంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా చేపడుతున్నారన్నారు.
ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ గఫర్‌మియా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుత్తెదారుతో మాట్లాడి ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేసిన తర్వాతే రెండో విడత పనులు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో పనులు చేపడతామని గుత్తెదారు తెలపడంతో టీఆర్‌ఎస్ నాయకులు శాంతించారు. పనులను అడ్డుకున్న వారిలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీరాం, నాయకులు రవీందర్‌గౌడ్, దొడ్డి శ్రీనివాస్, హైమద్‌ఖాన్ తదితరు లున్నారు.
మిషన్ కాకతీయ పనుల అడ్డగింత
Published Fri, Jun 3 2016 10:20 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement