సిద్ధిపేట రూరల్: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం పాఠశాలలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.