ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ సంఘీభావం  | BRS Leaders Rally for Hyderabad Auto Drivers | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ సంఘీభావం 

Feb 10 2024 2:57 AM | Updated on Feb 10 2024 2:21 PM

BRS Leaders Rally for Hyderabad Auto Drivers - Sakshi

 ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న హరీశ్‌రావు, గంగుల, తలసాని, వేముల

సాక్షి, హైదరాబాద్‌: ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టి తెచ్చే లక్ష్యంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఆటోల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. సుమారు 20కి పైగా ఆటోల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత, సునీత లక్ష్మారెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి తదితరులు అసెంబ్లీకి వచ్చారు.

ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పబ్లిక్‌ గార్డెన్స్‌ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలను లోపలికి అనుమతించేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కునే క్రమంలో కేపీ వివేకానందతో జరిగిన తోపులాటలో కారు అద్దం పగిలింది. ఆటో కార్మి కుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శాసనసభకు, ఎమ్మెల్సీలు శాసనమండలికి కాలినడకన చేరుకున్నారు. నల్ల కండువాలతో శాసనమండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement