27న సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ రైతుధర్నా | BRS Rythu Dharna On September 27 | Sakshi
Sakshi News home page

27న సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ రైతుధర్నా

Published Sat, Sep 21 2024 5:00 PM | Last Updated on Sat, Sep 21 2024 5:31 PM

BRS Rythu Dharna On September 27

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతన్నకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది.రుణమాఫీ,రైతు బంధు,పంట బోనస్ కోసం రైతుధర్నా వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.సెప్టెంబర్‌ 27వ తేదీ శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు.

రైతు ధర్నాకు పెద్ద ఎత్తున కదిలి రావాలని రైతన్నలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని చ్చరించారు.రైతు ధర్నాపై హరీశ్‌రావు శనివారం(సెప్టెంబర్‌21) రైతులు,పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఇదీ చదవండి.. హరీశ్‌ హార్డ్‌వర్కర్‌..సలహాలివ్వొచ్చు: మంత్రి పొన్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement