దేశంలోనే తొలిసారిగా ‘ఇస్రో’తో తెలంగాణ! | telangana govt agrrement with isro over tanks | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలిసారిగా ‘ఇస్రో’తో తెలంగాణ!

Published Sun, Oct 9 2016 8:05 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

దేశంలోనే తొలిసారిగా ‘ఇస్రో’తో తెలంగాణ! - Sakshi

దేశంలోనే తొలిసారిగా ‘ఇస్రో’తో తెలంగాణ!

హైదరాబాద్‌/సిద్దిపేట జోన్: చెరువుల పరిరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒప్పందం కుదుర్చుకోబోతున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఇస్రోతో రాష్ర్ట ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) శ్రీహరికోట ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణకు ఇస్రో సహకారం ఎంతో దోహదపడుతుందన్నారు.

చెరువుల అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు, చెరువుల నీటి మట్టం, ఎఫ్‌టీఎల్ సమగ్ర రూపం, ఇసుక మట్టం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇస్రోతో ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు అన్ని రంగాల అభివృద్ధికి వీలు కల్పిస్తున్నాయన్నారు. ఇస్రో చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లకు మ్యాపింగ్ ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం షార్ గ్యాలరీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నమూనా క్షిపణులు, రాకెట్ నమూనాలు, అంతరిక్ష ప్రయోగాల గురించి షార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement