Ts: ప్రభుత్వానిది వైట్‌ పేపర్‌ కాదు.. ఫాల్స్‌పేపర్‌: హరీశ్‌రావు | Harishrao Comments On Assembly Budget Session In Telangana | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది వైట్‌ పేపర్‌ కాదు.. ఫాల్స్‌పేపర్‌: హరీశ్‌రావు

Published Sat, Feb 17 2024 8:51 PM | Last Updated on Sat, Feb 17 2024 9:17 PM

Harishrao Comments On Assembly Budget Session In Telangana - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్‌ఎంబీకి అప్పగించబోని బీఆర్‌ఎస్‌ చెప్పించిందని, ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్‌ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. 

‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి  ప్రెజెంటేషన్‌లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు.

కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్‌ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో​ సీఎంలుగా పనిచేసిన వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్‌ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది.

ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక‌్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారు.

మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. 

ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement