రాహుల్‌ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు | ​​Harish Rao Counter To Rahulgandhi Nirmal Meeting Comments | Sakshi
Sakshi News home page

రాహుల్‌ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు

Published Sun, May 5 2024 7:28 PM | Last Updated on Sun, May 5 2024 7:28 PM

​​Harish Rao Counter To Rahulgandhi Nirmal Meeting Comments

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్‌(ట్విటర్‌)లో హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.

తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement