
'ఎన్నికలొస్తే ఇద్దరు తప్ప ఎవరూ గెలవలేరు'
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై, అధికార పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు చేశారు. నల్లగొండ పట్టణంలో స్థానిక మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికలొస్తే రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్ప ఎవరూ గెలవలేరంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గెలుస్తారని వెంకట్ రెడ్డి చెప్పిన వారి పేర్లలో కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం విదితమే.