సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్‌పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు.
అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్‌పేపర్‌కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.
నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment