
ఆ విషయంలో హరీశ్ తో పోటీ: కేటీఆర్
హైదరాబాద్ : అభివృద్ధి విషయం మాత్రమే తాను, హరీశ్ రావు పోటీ పడతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పోటీ ఉండటంలో తప్పులేదన్నారు.
రైతులకు రుణమాఫీ విషయంలో వన్టైం సెటిల్మెంట్లో తమ వైఖరి స్పష్టం చేశామన్నారు. రాజకీయ లబ్ది కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసుల తమ విధి నిర్వహణలో భాగంగానే వరంగల్ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన అన్నారు. వాటర్ గ్రిడ్పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.