
సాక్షి, విజయవాడ : పోలీసులమంటూ చిరువ్యాపారస్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోన్న ఇద్దరు నకిలీ పోలీసులు గుట్టురట్టయ్యింది. గుంటూరుకు చెందిన ఓగుల వీరనారాయణ మరో వ్యక్తితో కలిసి స్పెషల్ బ్రాంచ్ పోలీసులమంటూ వ్యాపారస్తుల వద్ద డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన వ్యాపారస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరి గుట్టు రట్టయ్యింది. వ్యాపారస్తుల ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు వీరనారాయణను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నకిలీ పోలీస్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment