తల్లిది ఆశయం.. తనయుడిది మోసం | Fake Police | Sakshi
Sakshi News home page

తల్లిది ఆశయం.. తనయుడిది మోసం

Published Wed, Jul 20 2016 5:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

తల్లిది ఆశయం.. తనయుడిది మోసం - Sakshi

తల్లిది ఆశయం.. తనయుడిది మోసం

  నకిలీ పోలీస్‌ రిమాండ్‌ 
  యూనిఫాం ధరించి వసూళ్లకు పాల్పడిన వ్యక్తి 
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ స్వామి

మోమిన్‌పేట: పోలీస్‌నని నమ్మబలికి డబ్బు వసూళ్లు చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వికారాబాద్‌ డీఎస్పీ స్వామి తెలిపారు. మంగళవారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నవాబుపేట మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన ధన్నారం బాలయ్య యూనిఫాం వేసుకొని పోలీస్‌నని చెప్పుకుంటూ కొంతకాలంగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆయన సోమవారం సాయంత్రం మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మెల్‌గిరిపేట దావిద్‌ తన బైక్‌పై తన అత్తను తీసుకొని సదాశివపేట మోమిన్‌పేట మీదుగా శంకర్‌పల్లి వైపు వెళ్తున్నాడు. మోమిన్‌పేట సమీపంలో పోలీస్‌ యూనిఫాంలో ఉన్న బాలయ్య అతడి బైక్‌ను నిలిపాడు. వాహనానికి సంబంధించిన కాగితాలు చూపించాలని దావిద్‌ను కోరాడు. ఆర్‌సీ బుక్‌ ఉందని, మిగతా పత్రాలు లేవని ఆయన బదులిచ్చాడు. కాగితాలు లేకపొతే రూ.1000 జరిమానా చెల్లించాలని బాలయ్య స్పష్టం చేశాడు. అంతడబ్బు తన వద్ద లేదని దావిద్‌ చెప్పగా బైక్‌ను సీజ్‌ చేస్తానని బెదిరించాడు. తన వద్ద కేవలం రూ.350లు ఉన్నాయని చెప్పగా మొత్తం డబ్బులు అతడు లాక్కున్నాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం రావడంతో దావిద్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ రాజు వెంటనే అక్కడికి చేరుకొని బాలయ్యను ఆదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. పోలీస్‌ను కావాలని తన తల్లి మాణెమ్మ కోరిక అని.. దీంతో యూనిఫాం కొనుగోలు చేసినట్లు జంగయ్య చెప్పాడు. ఈక్రమంలో జల్సాలకు అలవాటు పడి వసూళ్లకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో సీఐ ఏవీ రంగా, ఎస్‌ఐ రాజు తదితరులు ఉన్నారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
యూనిఫాం వేసుకొని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ స్వామి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలాంటి వారి వల్లే పోలీసుల పరువుపోతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసులమంటూ బెదిరించిన వారి తీరుపై అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement