![Fake Police Arrest in Kaleshwaram Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/18/police.jpg.webp?itok=WKorckpq)
అమర్జిత్ సింగ్
కాళేశ్వరం: రూ.30వేల జీతం.. పేరైన కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగం.. యువకున్ని చూస్తే అచ్చం పోలీసులాగా ఉండే దేహదారుఢ్యం.. ఇదంతా బాగానే ఉన్నా పోలీస్ యూనిఫాంను పోలిన డ్రెస్సుతో అందరిని ఇస్మార్ట్‌గా బెదిరిస్తున్నాడు ఈ దొంగ పోలీస్!. అసలు విషయం ఏమిటంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లిపంపుహౌస్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమర్జిత్‌సింగ్ భూమ్‌ప్రెసర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి నెలకు రూ.30వేల జీతం కూడా వస్తుంది. కానీ వక్రబుద్ధితో పోలీస్‌లా డ్రెస్సు వేసుకొని అంతర్రాష్ట్ర వంతెన వద్ద వచ్చిపోయే ఆటోవాలాలను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పూనుకున్నాడు. అనుమానం వచ్చిన ఆటోవాలాలు శనివారం సాయంత్రం కాళేశ్వరం పోలీసులకు దొంగ పోలీస్‌పై సమాచారం ఇవ్వగా స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన పద్ధతిలో లాఠీకి పని చెప్పారు. అయితే అతడిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కంపెనీ వారు రావడంతో వదిలిపెట్టారు. గతంలోనూ మద్యం తీసుకు వెళ్తున్న వ్యక్తులను ఇదే డ్రెస్సులో వచ్చి మద్యం బాటిళ్లు లాక్కున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతగాడి వ్యవహారం వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment