తిరుపతిలో ఐదుగురు నకిలీ పోలీసుల అరెస్టు | 5 fake police arrested | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఐదుగురు నకిలీ పోలీసుల అరెస్టు

Published Tue, Mar 29 2016 8:01 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

5 fake police arrested

తిరుపతి : టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి లారీలు, ఆటోలు నిలిపి.. డ్రైవర్లను బెదిరించి అందినకాడికి వసూలు చేసే ముఠాను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్సీ గోపీనాథ్ జెట్టీ మంగళవారం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతి సబ్‌డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి చైతన్యపురం వద్ద తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలోని వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు.

వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తిరుపతికి చెందిన విజయ్, షేక్‌షౌకత్ అలీ, వెంకటేశ్, బాలరాజు, ఢిల్లీరాజు. పాత కేసుల్లో నిందితులు. ఈ ఐదుగురూ కలసి ఇటీవల పోలీసులమని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్టు విచారణలో అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement