వైన్స్, కల్లు కాంపౌండ్, వ్యభిచార గృహాల వద్ద పోలీసులమని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల నకిలీ పోలీసుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైన్స్, కల్లు కాంపౌండ్, వ్యభిచార గృహాల వద్ద పోలీసులమని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల నకిలీ పోలీసుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 తులాల బంగారం, రూ.20 వేల నగదు, ఒక నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్, చైతన్యపురి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసుల పేరు చెప్పి.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. వలపన్ని పట్టుకున్నారు. నిందితుల్లో ఓ హోంగార్డు కూడా ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.