నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బులు, నగలు దోచుకుంటున్న ఓ నకిలీ పోలీసు (సూడో పోలీసు) ఆటకట్టించారు. మంగలే సుభాష్ మిట్టల్ అనే పాత నేరస్తుడు గతంలో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆ దొంగ.. ఏకంగా పోలీసు అవతారం ఎత్తాడు. నేర ప్రవృత్తికి అలవాడు పడ్డ సుభాష్ మిట్టల్.. గత కొన్ని రోజులుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, వద్ధులను టార్గెట్ చేసుకున్నాడు. పోలీస్‌నంటూ చెప్పి ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను బెదిరించేవాడు.