
పోలీసుల పేరుతో రూ.82 లక్షల దోపిడీ!
నెల్లూరు: కొందరు దుండగులు పోలీసుల పేరుతో 82 లక్షల రూపాయలు దోపిడీ చేశారు. నవజీవన్ ఎక్స్ప్రెస్లో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. రైలులో పలువురిని వారు తనిఖీ చేశారు. ఇద్దరు బంగారు వ్యాపారులు రామయ్య, మరొకరిని కూడా తనిఖీ చేశారు. రైలు పడుగుపాడు వద్దకు రాగానే విచారణ పేరుతో వారు ఆ వ్యాపారులను కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు.
కారు దామవరం వద్దకు వెళ్లిన తరువాత, వ్యాపారుల వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకొని వారిని కిందకు తోసి పారిపోయారు. వ్యాపారులు కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యాపారులు బంగారం కొనుగోలుకు చెన్నై వెళుతుంటారు. ఈ విషయం తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.