Gold traders
-
గిరాకీ బంగారమాయెనే
చార్మినార్: నగరంలో 400 ఏళ్ల కిందట బంగారం వ్యాపారం అంటేనే పాతబస్తీ. నిజాం కాలం నుంచి పాతబస్తీలో కొనసాగుతున్న బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు ప్రస్తుతం కష్టకాలమొచి్చంది. ఇక్కడి వ్యాపారాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అసలే బాటిల్ నెక్ రోడ్లు.. దీనికి తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీలో బంగారం వ్యాపారం తగ్గింది. చిన్న వ్యాపారులు రూ.50 లక్షల నుంచి.. పెద్ద పెద్ద షోరూం వ్యాపారులు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్న ఇక్కడి వ్యాపారులకు మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో పాతబస్తీలోని దుకాణదారులు తమ వ్యాపారాలను నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధాన సమస్య పార్కింగే.. పాతబస్తీలో ద్విచక్ర వాహనాల పార్కింగ్తో పాటు కార్లు, భారీ వాహనాలకు పార్కింగ్ సమస్య, నిత్యం ట్రాఫిక్ రద్దీ పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. వీటిని ఎక్కడ పార్క్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటు పడుతున్నాయంటున్నారు. పార్కింగ్ అందుబాటులో లేకపోవడమే కాకుండా నిత్యం వాహనాల రద్దీతో పాటు రోడ్లపై నెమ్మదిగా కదిలే వాహనాలు పాతబస్తీలోని బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు అడ్డుగా మారాయి. నిజాం కాలం నుంచి.. ఒకప్పుడు చార్మినార్ పరిసరాల్లో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేసుకోవడానికి నిజాం సర్కార్‌లో అప్పటి నిజాం స్వయంగా కొంత మందిని ఉత్తర భారతదేశం నుంచి రప్పించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. నిజాం కాలం నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్, కాలికమాన్, చార్‌కమాన్, ఘన్సీబజార్, శాలిబండ, సిద్ధి అంబర్ బజార్ తదితర ప్రాంతాల్లో దాదాపు 300 వరకు దుకాణాలుండేవి. ప్రస్తుతం 50 నుంచి 100 దుకాణాలకు తగ్గిపోయాయి. వీరంతా నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసి ఇవ్వడానికి పనిచేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతబస్తీలో వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపట్టాలి మదీనా నుంచి చార్‌కమాన్–చార్మినార్ వరకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు ఇటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో పాటు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. – నాగ్నాథ్ మాశెట్టి, గుల్జార్‌హౌస్/బషీర్‌బాగ్ -
బంగారం వ్యాపారులపై తుపాకీతో కాల్పులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): బంగారు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగింది. గరివిడి ఎస్ఐ ఎల్.దామోదరరావు కథనం ప్రకారం... రాజాం పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు బంగారు వర్తకులు రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వర్తకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లోకి విసిరేశారు. వారి నుంచి ఏమీ దొరక్కపోవడంతో సెల్ఫోన్లను లాక్కున్నారు. దుండగలు జరిపిన కాల్పుల్లో ఒక వర్తకుడికి బుల్లెట్ తగిలి ఎడమ చేతికి గాయమైంది. ఆయన రాజాం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం, డాగ్‌స్క్వాడ్ పరిశీలించాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 7న ఇదే రోడ్డులో గరివిడి మండలం కాపుశంబం కూడలి వద్ద కూడా రాత్రి 12 గంటల సమయంలో చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేయడమే కాకుండా వెంటాడి భయాందోళనకు గురిచేశారు. -
నల్లమలలో దారి దోపిడీ
గిద్దలూరు రూరల్: గుర్తు తెలియని దుండగులు బంగారం వ్యాపారులు ప్రయాణిస్తున్న కారును అటకాయించి.. అందులోని వారిని చితకబాది రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం దోచుకుపోయిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారి షేక్ బాజీవలి వద్ద షేక్ పీరావలి, సుభాషిణి, సైదా పనిచేస్తున్నారు. ఆ ముగ్గురు శుక్రవారం నరసరావుపేట నుంచి కారులో నంద్యాల చేరుకున్నారు. వ్యా పార లావాదేవీలు ముగించుకున్న అనంతరం రూ.14 లక్షల నగదు, ఒక కిలో 300 గ్రాముల బంగారాన్ని కారులోని సీక్రెట్ లాకర్లో పెట్టి శనివారం రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇదే తరహాలో నరసరావుపేటకు చెందిన మరో ఇద్దరు బంగారు వ్యాపారులు పవన్‌ప్రదీప్, మొహిబ్ రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారాన్ని బ్యాగ్‌లో ఉంచుకుని నరసరావుపేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు లేవంటూ మొహిబ్ తనకు తెలిసిన తోటి బంగారు వ్యాపారి పీరావలికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారిద్దరినీ తమ కారులోనే నరసరావుపేటకు రావచ్చని చెప్పడంతో అందరూ కలిసి ఒకే కారులో నరసరావుపేట బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారును ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు నంద్యాల నుంచి మరో కారులో వెంబడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడ్డగించి కారు లోని ఐదుగురిని చితకబాదారు. అనంతరం వారిని బయటకు లాగిపడేసి కారుతో పాటు గా దుండగులు గిద్దలూరు వైపుగా వచ్చారు. దొంగిలించిన కారును కేఎస్ పల్లె సమీపంలోని బైరేనిగుండాల పైలట్ ప్రాజెక్టు క్రాస్ రోడ్డులో ఆపి కారులో పవన్‌ప్రదీప్, మొహిబ్లకు చెందిన రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు ఐదుగురు నంద్యాల టూ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో వారు గిద్దలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను గిద్దలూరు వైపు తీసుకొస్తున్న నేపథ్యంలో కేఎస్ పల్లె సమీపంలో కారును గుర్తించారు. కారులోని సీక్రెట్ లాకర్‌ను తెరిచి చూడగా కిలో 300 గ్రాముల బంగారం, రూ.14 లక్షల నగదు జాగ్రత్తగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏఎస్పీ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. -
వాడిన బంగారం విక్రయిస్తే వచ్చే లాభంపై పన్ను
న్యూఢిల్లీ: బంగారం వర్తకులు వాడిన బంగారం విక్రయించగా వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక రాష్ట్ర ఆథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేసింది. బెంగళూరుకు చెందిన ఆద్య గోల్డ్ ప్రైవేటు లిమిటెడ్ దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ తీర్పునిచ్చింది. వ్యక్తుల నుంచి వినియోగించిన బంగారం లేదా బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి.. వాటిని అదే రూపంలో విక్రయించినప్పుడు.. ధరల మధ్య తేడాపైనే జీఎస్టీ చెల్లిం చాలా? అని ఆద్య గోల్డ్ తన దరఖాస్తులో స్పష్టత కోరింది. దీంతో రూపం మార్చకుండా యథాతథంగా విక్రయించిన సందర్భాల్లో కొనుగోలు, విక్రయం ధరల మధ్య తేడాపైనే జీఎస్టీ చెల్లించాలని ఏఏఆర్ స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల వాడిన బంగారం (సెకండ్‌హ్యాండ్) విక్రయంపై జీఎస్టీ భారం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బంగారం..స్మగ్లర్ల సింగారం
బంగారం.. ఈ పేరు వింటే చాలు మహిళల కళ్లు జిగేల్మంటాయి.. ఉన్నోళ్లు, పెద్దగా లేనోళ్లు.. ఎవరైనా సరే ఉన్నంతలో పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లకు నగలు ధరించడం అంటే అత్యంత ప్రీతిపాత్రం.. అమ్మాయిల పెళ్లిళ్ల కోసం ఏళ్లతరబడి కూడబెట్టిన సొమ్ముతో పలువురు నగలు కొంటుంటారు.. మరికొందరు ఏటా కొద్ది మొత్తంలో బంగారం కొని, దాచుకుంటుంటారు.. ఇది నగదుకు ప్రత్యామ్నాయం.. అందువల్లే ఎప్పుడైనా, ఎక్కడైనా సరే బంగారానికి యమా గిరాకీ. ఈ గిరాకీనే వ్యాపారుల పాలిట ‘బంగారం’గా మారింది. లాభాల కోసం ‘అడ్డ దారి’ రాజ మార్గం అయింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బంగారం ధర దేశ దేశాలకూ మారుతుంది. రాష్ట్రంలోనూ ఒక్కో ఊళ్లో ఒక్కో ధర ఉంటుంది. ఇదే అదనుగా చెన్నైలోని బంగారం (గోల్డ్) స్మగ్లింగ్ ముఠా పేట్రేగి పోతోంది. ఎయిర్‌పోర్టు, షిప్పింగ్ పోర్టులను అడ్డాలగా మార్చుకుని విదేశీ బంగారాన్ని తక్కువ ధరకు అనధికారికంగా దిగుమతి చేసుకుంటోంది. తర్వాత ఆభరణాలుగా తయారు చేసి అధిక ధరకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు నగరానికి.. నెల్లూరు నుంచి లైన్ బిజినెస్ పేరుతో విశాఖపట్నం వరకు అన్ని ప్రాంతాలకు బంగారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అతికొద్ది షాపులు మినహా ఎక్కడా పన్నులు చెల్లించిన దాఖలాలు లేవు. చెన్నై నగరం నుంచి కస్టమ్ డ్యూటీ, జీఎçస్టీ చెల్లించకుండా రోజూ నెల్లూరుతోపాటు రాష్ట్రమంతా వంద కిలోలకు పైగానే బంగారం బిస్కెట్లు, ఆభరణాలు సరఫరా అవుతున్నాయి. నెల్లూరు నగరంలోని బంగారం విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (ఫైల్) , గత డిసెంబర్లో చెన్నై నుంచి బస్సులో అక్రమంగా తరలిస్తున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును పట్టుకున్న అధికారులు (ఫైల్) ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా.. నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారం మారిన క్రమంలో ధరలు నింగినంటుతున్నాయి. ప్రధానంగా శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్, ఇతర అరబ్ దేశాల నుంచి ప్రతి రోజూ రాష్ట్ర సరిహద్దులోని చెన్నై నగరానికి కిలోల కొద్దీ బంగారం దిగుమతి అవుతోంది. బంగారానికి గతంలో 12.5 శాతం కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి తగ్గించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు కలిపి 3 శాతం ఉంది. అంటే మొత్తంగా దిగుమతి అయి కొనుగోలు చేసే బంగారానికి 10.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ అవేవీ చెల్లించకుండానే వందల కిలోల బంగారం వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రత్యేక కొరియర్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం బంగారం వ్యాపారాలపై తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం. ఫిర్యాదుల వస్తే తప్పకుండా తనిఖీలు చేపట్టి, ఫెనాల్టీతో పన్ను వసూలు చేస్తాం. రెండేళ్లలో 25 కేసులు నమోదు చేశాం. వారి నుంచి రూ.1.5 కోట్లకు పైగా పన్నుతో పాటు ఫెనాల్టీ విధించాం. – కల్పన, జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు బంగారం వ్యాపారులు జీఎస్టీ ఎగవేతపై పక్కా సమాచారంతో ఇటీవల నెల్లూరు కేంద్రంలో మూడు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. క్రయ, విక్రయాలు, జీఎస్టీకి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం. – కె.రాజేశ్వరరెడ్డి, రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, నెల్లూరు స్మగ్లర్లకు ఆదాయం ఇలా.. ► 24 క్యారెట్ల బంగారం కిలో ధర మద్రాసు బులియన్ మార్కెట్లో రూ.47.88 లక్షలు ఉండగా, హైదరాబాద్‌లో రూ.47.78 లక్షలుగా ఉంది. అదే దుబాయ్‌లో మన కరెన్సీ ప్రకారం రూ.42.59 లక్షలు, శ్రీలంకలో రూ.40.16 లక్షలు ఉంది. ► ఉదాహరణకు.. శ్రీలంక నుంచి కొనుగోలు చేస్తే, అక్కడి ధరకు 10.5 శాతం అంటే సుమారు రూ.4.20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా చేయకుండా కస్టమ్స్ కళ్లుగప్పి.. లేదా వారితో ఒప్పందం కుదుర్చుకుని, తెచ్చిన బంగారాన్ని మద్రాసు ధర ప్రకారం కిలో రూ.47.88 లక్షలకు విక్రయిస్తారు. ► ఈ లెక్కన కేజీకి రూ.7 లక్షలు, పన్నుల రూపంలో మరో రూ.4 లక్షలు మొత్తంగా రూ.11 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇందులో సగటున 20 శాతం వరకు వివిధ శాఖలకు మామూళ్లు చెల్లించి వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నెల్లూరు కేంద్రంగా భారీగా వ్యాపారం ► రాష్ట్రంలో బంగారు ఆభరణాల తయారీకి, ప్రత్యేకంగా స్టోన్ వర్క్ ఆభరణాల తయారీకి నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ ధరలు తక్కువ. డిజైన్లు ఎక్కువ. రోజూ సగటున వంద కేజీల బంగారం నెల్లూరు జిల్లా వ్యాపారులే కొంటున్నట్లు అంచనా. ► వీటిలో సగం బిస్కెట్ల రూపంలో, మిగిలిన సగం ఆభరణాల రూపంలో రైళ్లలో తీసుకొస్తారు. రాష్ట్రంలోకి 70 శాతం బంగారం చెన్నై ద్వారానే వస్తుంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోనూ ఇదే తరహాలో వ్యాపారం సాగుతోంది. -
శిక్షించాల్సింది ఆ బంగారం కొంటున్న వారిని..
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్: దోచుకొచ్చిన బంగారాన్ని దొంగల నుంచి కొనుగోలు చేస్తున్న బంగారు వ్యాపారులు, పాన్‌బ్రోకర్లపై కఠినంగా వ్యవహ రించకపోవడం వల్లే దొంగతనాలు పెరుగు తున్నాయని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. దొంగతనం చేసి తీసుకొచ్చిన బంగారాన్ని కొంటూ మళ్లీ మళ్లీ దొంగతనాలను చేయాలని దొంగలను వారే ప్రోత్సహిస్తున్నారంది. ఇలా ప్రోత్సాహం అందిస్తున్న వారినే శిక్షించాలని స్పష్టం చేసింది. దొంగ సొత్తు కొనుగోలు చేసిన ఓ వ్యాపారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చేం దుకు నిరాకరించిన హైకోర్టు తదుపరి విచారణ ను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా, పరిగి పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే తమను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుల్బర్గాకు చెందిన జీవన్ హనుమంత్ సావంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని బుధవారం హైకోర్టు విచారించింది. హోంశాఖ సహాయ న్యాయవాది పిటిషనర్‌కు దొంగ బంగారం కొనుగోలు చేయడం అలవాటని, అతనిపై 20 కేసులున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, ఇటువంటి వ్యక్తులే దొంగతనాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. -
‘నల్ల’ బంగారం.. రూ.50 వేలు!!
-
‘నల్ల’ బంగారం.. రూ.50 వేలు!!
• గురువారం ఒక్కరోజే దాదాపు రూ.300 కోట్ల విక్రయాలు • పాత నోట్లతో మార్పిడికి నల్ల కుబేరుల పరుగులు • వెసులుబాటు కల్పిస్తున్న పసిడి వ్యాపారులు • ముంబై, ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే తీరు.. హైదరాబాద్, సాక్షి: బంగారం తులం రూ.50 వేలు!! ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమే!. కాకపోతే ఈ రేటు అందరికీ కాదు. చలామణికి పనికిరావని కేంద్రం ప్రకటించిన పాత రూ.500, రూ.1000 నోట్లతో కొనాలనుకున్నవారికే. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించటంతో నల్ల కుబేరులు తమ నగదును బ్యాంకుల్లో మార్చుకోవటం కష్టమని భావించి బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారికి బంగారం వ్యాపారులు కూడా లోపాయకారీగా వెసులుబాటు కల్పిస్తున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లు తెచ్చినవారికి అధిక రేటుకు బంగారాన్ని విక్రరుుంచడానికి మొగ్గు చూపుతున్నారు. ఆ నోట్లు తీసుకోవటం చట్టవిరుద్ధం నిజానికి 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తరవాత పెట్రోలు బంకులు, ప్రభుత్వాసుపత్రులు, మందుల షాపుల వంటి కొన్ని అత్యవసర సేవలందించేవి తప్ప మిగతా సంస్థలుగానీ, వ్యాపారులుగానీ పాత రూ.500, రూ.1,000 నోట్లను తీసుకోకూడదు. అది చట్ట విరుద్ధం. ఎవ్వరైనా తమ వద్దనున్న పాత నోట్లను బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి. కానీ భారీ ఎత్తున డబ్బు కలిగి ఉన్నవారు బ్యాంకుల్లో వేస్తే పన్ను అధికారులు నిఘా వేసి... నోటీసులు పంపించే అవకాశం ఉంది. అది నల్లధనమని తేలితే దాదాపు 200 శాతం జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. పోనీ బ్యాంకుల్లో వేయకుండా ఆ నోట్లను అలాగే వదిలేద్దామనుకుంటే... డిసెంబర్ 31 తరవాత అవి ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలైపోతారుు. ఇలా ఆలోచిస్తున్న వారికోసమే కొందరు బంగారం వ్యాపారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో ఒక్కరోజే రూ.300 కోట్ల వ్యాపారం! పాత నోట్లను తీసుకుని బంగారాన్ని విక్రరుుస్తుండటంతో హైదరాబాద్‌లో కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు రూ.300 కోట్లకు పైగా బంగారం వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. గత రెండురోజులుగా బంగారం క్రయ, విక్రయాలు తారస్థారుుకి చేరారుు. దీంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బంగాారం ధరను ఒకేసారి పెంచేశారు. గురువారం హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్దంబర్ బజార్ మార్కెట్లలో బంగారం తులం ధర రూ.50 వేల వరకూ పలికింది. నిజానికి కొందరు వ్యాపారులు బంగారం విక్రయాన్ని కూడా బ్లాక్‌లో చూపిస్తున్నారు. అలాంటి వారికి ఆ బంగారం బదులుగా బ్లాక్ మనీ చేతికొస్తుండటంతో వారు దీన్నొక అవకాశంగా భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర తులం రూ.32వేల పైగా ఉండగా, రూ.100 నోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించటం లేదు. బ్లాక్‌మనీ కలిగిన వారే పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండటంతో ధర ఎగబాకుతోంది. -
మీ పొలం బంగారం గాను..
♦ అనంతపురం జిల్లా ఉప్పరపల్లి వద్ద బంగారు నాణేలు లభ్యం ♦ ఎండలోనూ నాణేల వేటలో జనం ♦ కొనుగోలుకు బంగారు వ్యాపారుల క్యూ అనంతపురం రూరల్: ఆ గ్రామం వద్ద వెతుకున్న వారికి వెతుకున్నన్ని బంగారు నాణేలు లభిస్తున్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా?! అవును ఇది నిజమే. గ్రామస్తులు రోజూ పిల్లాపాపలతో పొలంలోకి వెళ్లి బంగారు నాణేలను అన్వేషిస్తున్నారు. సాయంత్రానికి బంగారు వ్యాపారులు కూడా కొనుగోలు కోసం ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆ గ్రామమే అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లి. గ్రామానికి చెందిన కురుబ బిల్లే రాముడు పొలంలో నెల కిందట ఓ వ్యక్తికి బంగారు నాణేలు దొరికాయి. ఈ విషయం తెలిసి మిగిలిన వారూ అన్వేషణ మొదలుపెట్టారు. గుంపులు గుంపులుగా వెళ్లి.. ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా నాణేల వేటలో నిమగ్నమవుతున్నారు. ఒక అడుగు లోతు తవ్వితే చాలు 2 నుంచి 3 గ్రాముల బరువు ఉన్న బంగారు నాణేలు బయట పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అనంతపురం పాతవూరుకు చెందిన బంగారం వ్యాపారులు కూడా వాటిని కొనుగోలు చేయడానికి గ్రామం బాట పడుతున్నారు. రోజూ 60 నుంచి 70 నాణేలను గ్రామస్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో నాణేన్ని వ్యాపారులు రూ.3,500కు కొంటున్నారు. నాణేలపై ఒకవైపు దేవతా ప్రతిమలు, మరోవైపు శాసన లిపి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో రాజులు బస చేసేవారని, అందుకే బంగారు నాణేలు లభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. నాణేలు దొరుకుతున్నది వాస్తవమే ఉప్పరపల్లిలో బంగారు నాణేలు దొరుకుతున్న మాట వాస్తవమే. అవి కూడా చిన్న పిల్లలకు దొరికినట్లు మా విచారణలో వెల్లడైంది. వాటిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ -
సమ్మె తాత్కాలికంగా విరమించిన జువెలర్స్
న్యూఢిల్లీ: బంగారు వ్యాపారులు ఎక్సైజ్ సుంకం విధింపునకు వ్యతిరేకంగా 42 రోజుల నుంచి (మార్చి 2) చేస్తోన్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. దేశ రాజధాని ఢిల్లీలో జువెలర్స్ సమ్మె బాట వదిలారు. జువెలర్స్‌పై ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవన్న ప్రభుత్వపు హామీ నేపథ్యంలో సమ్మెను ఏప్రిల్ 24 వరకు నిలిపివేస్తున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో కూడా సమ్మెను ఏప్రిల్ 24 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మహా రాష్ట్ర రాజ్య సరాఫా సువర్ణకార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా వెల్లడించారు. ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకం విధింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏప్రిల్ 25 నుంచి తిరిగి సమ్మెను ప్రారంభిస్తామని బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ వర్మ హెచ్చరించారు. జువెలరీ పరిశ్రమకు 42 రోజుల సమ్మె కారణంగా రూ. లక్ష కోట్లమేర నష్టం వచ్చింటుందని అంచనా. -
కూరగాయలమ్మిన బంగారం వర్తకులు
తిరుపతి: బంగారం వర్తకులు టీ, టిఫిన్, కూరగాయలు విక్రయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి పట్టణంలోని చిన్న బజార్ వీధిలో ఈ వినూత్న దృశ్యం చోటు చేసుకుంది. ఆభరణాలపై కేంద్రం విధించిన ఎక్సైజ్ పన్నును ఎత్తివేయాలని కోరుతూ బంగారం వర్తకులు బుధవారం నుంచి బంద్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం షాపులు బంద్ చేసి తమ షాపుల ముందే టీ, టిఫిన్, కూరగాయలను విక్రయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ విధించడం వల్ల బంగారం వ్యాపారం దెబ్బతినే పరిస్థితి దాపురించిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ముగిసిన బంగారం వ్యాపారుల బంద్
పాత శ్రీకాకుళం: కేంద్రం తన పంతం నెగ్గుంచుకొంది. దేశవ్యాప్త బంగారు వర్తకులఆందోళనలో భాగంగా జిల్లాలో పది రోజులుగా చేపట్టిన బంద్ ఎట్టకేలకు ముగిసింది. శుక్రవారం నుంచి యథాతధంగా దుకాణాలను తెరిచేందుకు బంగారం వర్తకులు సిద్ధమయ్యారు. వారం రోజులుగా బంగారం దుకాణాలు మూత పడడంతో వర్తకులు నష్టాన్నే చవిచూశారు తప్ప అనుకున్న ఫలితాన్ని రాబెట్టుకో లేకపోయారు. దీంతో మొర్రోమంటూ బంగారు వర్తకులంతా వెనుదిరిగారు. గురువారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన సమావేశంలో అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికీ అవి నిరాశ పరిచాయని ఓ వ్యాపారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. చేసేదిలేక శుక్రవారం నుంచి జిల్లాలోని షాపులన్నింటినీ తెరిచేందుకు సిద్ధమయ్యారు. అసలే పెళ్లిళ్ల సీజన్, ఆపై ముంచుకొస్తున్న మంచి మహూర్తాలు, ఈ సమయంలో షాపులు తీయకపోతే అసలుకే ఎసరు పడుతోందన్న భ యంతో షాపులు తీసేందుకు వర్తకులంతా సిద్ధమయ్యారు. ఈనెల 20 నుంచి ఏప్రిల్ చివరి వరకూ పెళ్లి మహూర్తాలు వస్తున్నాయి. ఈ సయంలో షాపులు తీయకపోతే వర్తకులకు నష్టంతోపాటు, పెళ్లిళ్లు చేసేవారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.2 కోట్ల నష్టం జిల్లాలో 300 బంగారం వ్యాపారం షాపులకు సుమారు రూ.2 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇందులో షాపుల అద్దెలే కాకుండా సిబ్బంది జీతాలు కుడా తీయాల్సి వుంది. పెద్దపెద్ద షాపులకు రోజుకు లక్షల్లో వ్యాపారం జరిగినా చిన్న షాపులకు కుడా సుమారు రూ.30 నుంచి 50 వేల మధ్యలో వ్యాపారం జరగుతుండేది. దీంతో ఏకధాటిగా పదిరోజులు షాపులు బంద్ చేయడంతో రూ.2 కోట్లపైనే నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు చెబుతున్నారు. -
ఆగ్రహ స్వర్ణం
బంగారు వ్యాపారుల ఆందోళన 500 దుకాణాల మూసివేత వర్తకుల వద్ద ఉండిపోయిన ఆర్డర్లు పెళ్లిళ్లపై పడుతున్న ప్రభావం రోజూ అరకోటి లావాదేవీల నిలిపివేత సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం విధింపు అమలును నిరసిస్తూ జిల్లాలో బంగారు వర్తకులు నాలుగురోజులుగా నిరవధిక సమ్మెలోకి దిగారు. 500బంగారు దుకాణాలు మూతపడ్డాయి. ఈ ప్రభావం సుమారు ఐదు వేల కుటుంబాలపై పడింది. కేంద్రం 2015-16 బడ్జెట్లో ప్రకటించిన అన్ని లావాదేవీలపై 1శాతం ఎక్సైజ్ సుంకం అమల్లోకి వస్తే తాము ఇకపై వ్యాపారం చేయలేమని బంగారు వర్తకులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే 14.5శాతం రాష్ట్రానికి, 1శాతం కేంద్రానికి చెల్లిస్తున్నామని, భవిష్యత్తులో తయారీ, కొనుగోలు, అమ్మకాలు, మజూరీపై ఎక్సైజ్ సుంకం మరో 1శాతం చెల్లించాల్సి వస్తే కొనుగోలు దారులపై ఆ ప్రభావం పడి వ్యాపారాల్ని మూసేసే పరిస్థితి వస్తుందంటూ వ్యాపారులు ఆందోళన ప్రారంభించారు. రోజూ అరకోటి లావాదేవీలు జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు రూ.50లక్షల విలువైన బంగారం అమ్మకం/కొనుగోలు జరుగుతోంది. బులియన్ మార్కెట్ ఆధారంగా ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నవారు మరికొంతమంది ఉన్నారు. ధర్మకాటా, వస్తువుల తయారీ దారులు జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉన్నారు. ఇటీవల మరికొంత మంది కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆలిండియా గోల్డ్ అండ్ జ్యూయలరీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు వ్యాపారులు నిరవధిక బంద్ చేపట్టారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బంగారం వ్యాపారంపై ఎక్సైజ్ సుంకం విధానాన్ని రద్దు చేశారు. అనంతరం 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారులు దేశవ్యాప్తంగా 21రోజులు నిరసన వ్యక్తం చేసి జీవో రద్దు చేయించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వ్యాపారులకు అండగా నిల్చింది. అదే బీజేపీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ బంగారంపై పన్ను విధించడాన్ని వ్యాపారులు తప్పుబడుతున్నారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా వ్యాపారులు సమావేశమై కఠిన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తన ప్రకటనను వెనక్కు తీసుకునేంతవరకు తమ నిరసన ఆగదని ఇక్కడి వ్యాపారులకూ సమాచారం పంపించారు. బంగారం అధికంగా కొనుగోలు చేసేది వివాహాల సమయంలోనే. సంక్రాంతి తరువాత మాఘ మాసంలో చాలామంది ఆభరణాల కోసం ఆర్డర్లిచ్చారు. ముక్క బంగారం కొనుగోలు చేసి షరాబుల వద్ద మజూరీకి పంపించారు. వర్తకులు సమ్మెలోకి దిగడంతో ఆ ప్రభావం భారీగా పడనుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.5కోట్ల విలువైన వస్తువులు దుకాణదారులు, షరాబుల వద్దే ఉండిపోయాయి. ఇటీవల ఒక్కరోజే సుమారు రూ.10లక్షల వెండి విక్రయాలు నిల్చిపోయాయి. ఖాతాదారులు తయారైన కొత్త వస్తువులు తీసుకెళ్లకపోతే, సమ్మె ముగిసేంతవరకు ఇచ్చేది లేదని వ్యాపారులు చెబుతున్నారు. నెలకు రూ.50లక్షలు, ఏడాదికి కనీసం రూ.6కోట్ల టర్నోవర్ దాటే ప్రతీ వ్యాపారి విధిగా పన్ను చెల్లింపునకు బాధ్యుడవుతారని కేంద్రం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె నిర్ణయం తీసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. దుకాణాల బంద్ కారణం గా చిన్న వ్యాపారులు తాత్కాలికం గా, ఆర్థికంగా ఇబ్బంది పడినా జీవో రద్దయితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. బంగారు వర్తకుల కొవ్వొత్తుల ర్యాలీ పాత శ్రీకాకుళం: పట్టణంలోని బంగారం, వెండి వర్తకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఏడురోడ్ల జంక్షన్ నుంచి సూర్యమహాల్ జంక్షన్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు పేర్ల సాంబమూర్తి, చంద్రమౌళిరాజు, లంక గాంధీలు మాట్లాడుతూ ఇప్పటికే పెళ్లిళ్ల ముహూర్తాలు దగ్గర పడుతుండడంతో చాలామంది బంగారం కొనుక్కోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి బంగారం కొనుక్కోవడానికి వచ్చిన వారు షాపులు మూసి ఉండడంతో వెనక్కి వెళ్ళిపోతున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి బంగారంపై ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీలో బంగారం వెండి వర్తకులు వైకుంఠరావు, సన్యాసిరావు, పైడితల్లి, శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. స్పష్టమైన నిర్ణయం రావాల్సిందే.. సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించాం. రాష్ట్ర అసోసియేషన్ నుంచి స్పష్టమైన నిర్ణయం రావాలి. అది వెలువడే వరకు శ్రీకాకుళం జిల్లాలో దుకాణాలు తెరిచేదిలేదు. పేర్ల సాంబమూర్తి, అధ్యక్షుడు, జిల్లా గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
సుంకంపై సమరం
పాతబస్తీలోని బంగారు వ్యాపారులు కదం తొక్కారు. బంగారంపై ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా శనివారం సాయంత్రం చార్‌కమాన్ గుల్జార్హౌస్వద్ద భారీ స్థాయిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కదం తొక్కిన బంగారు వ్యాపారులు చార్మినార్: అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారు వ్యాపారులు రెండో రోజైన శనివారం చార్‌కమాన్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగించారు. చార్‌కమాన్ జ్యువె ల్లర్స్ అండ్ సరాఫా అసోసియేషన్, సిద్దంబర్‌బజార్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్, కాలికమాన్ చార్మినార్ జ్యువెల్లర్స్, శాలిబండ జ్యువెల్లర్స్ అసోసియేషన్, కాలికమాన్ చార్‌కమాన్ స్వర్ణకారుల సంఘం, చార్‌కమాన్ బెంగాలీ గోల్డ్‌స్మిత్ సంఘం, చార్‌కమాన్ హైదరాబాద్ జెమ్స్ సంఘ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బడ్జెట్లో బంగారంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 11 రోజులుగా తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలుపుతున్నా...కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సుంకాల పెంపును ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఆందోళనలో భాగంగా శనివారం సాయంత్రం చార్‌కమాన్ గుల్జార్‌హౌస్ వద్ద వ్యాపారులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
పుస్తెలకూ పసిడి కరువే
అమలాపురం టౌన్: పసిమివన్నె పసిడి నిత్యావసరవస్తువు కాకపోవచ్చు. అయినా బంగారం వ్యాపారులు పాటిస్తున్న బంద్ ప్రభావం.. లగ్గసరి నేపథ్యంలో హెచ్చుగానే ఉంది. చివరికి తాళిబొట్టు తయూరీకి అవసరమైన బంగారం కూడా కొనలేక వధూవరుల కుటుం బాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బంగారం విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించినందుకు నిరసనగా బంగారు వర్తకులు చేపట్టిన బంద్ ఈనెల 17 వరకూ జరగనుంది. దేశ వాప్తంగా బంద్ జరుగుతుండటంతో ఎక్కడ, ఎవరికి బంగారం అవసరమైనా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న రెండు వేలకు పైగా బంగారు దుకాణాలు ఈనెల 9 నుంచి మూతపడ్డారుు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం తదితర పట్టణాల్లోనే కాక మండల కేంద్రాల్లో ఉన్న పసిడి దుకాణాలూ తెరుచుకోక రోజుకు రూ.కోట్లలో అమ్మకాలు నిలిచిపోయాయి. ఈనెల 11,15 తేదీల్లో పెళ్లిళ్లకు బలమైన ముహూర్తాలు ఉండటంతో ఆ కుటుంబాలకు బంగారం లేదా నగలు కొనుగోలు చేయటం అత్యవసరం. ఈ రెండు ముహూర్తాల్లో జిల్లాలో మూడు వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా. కాలం మారిపోయి ఇప్పుడు పెళ్లిళ్లకు వధూవరులకు, ఇతర సంప్రదాయాలకు బంగారు నగలను తయారు చేయించటం లేదు. అప్పటికప్పుడు దుకాణాలకు వచ్చి రెడీమేడ్ నగలను వచ్చి కొనుగోలు చేయటం పరిపాటైంది. చివరకు మంగళ సూత్రాలు కూడా రెడీమేడ్‌వి వినియోగిస్తుండటంతో ముహూర్తం దగ్గర పడ్డా సూత్రం సిద్ధం కాకపోవటంతో కంగారు పడుతున్నారు. జిల్లాలో దుకాణాలు 9 రోజుల పాటు మూత పడటంతో పెళ్లి ఇళ్ల వారికి ఏమీ చేయలేని నిస్సహాయత ఎదురవుతోంది. ఏ విజయవాడో, హైదరాబాదో వెళ్లి కొందామన్నా వీలు కాని పరిస్థితి. ఈ క్రమంలో పెళ్లి ఇళ్ల వారు బంగారు దుకాణ యజమానుల వద్దకు వెళ్లి బతిమాలుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి బంగారు వర్తకుల బంద్ గురించి తెలియక నగరాలు, పట్టణాల్లోని దుకాణాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త బంగారముందా.. మిత్రులారా! కాట్రేనికోన మండలం దొంతుకుర్రుకు చెందిన ఓ కుటుంబంలో ఈనెల 15న పెళ్లి జరగనుంది. వారు బంగారు నగల కొనుగోలుకు శుక్రవారం అమలాపురంలోని ఓ పెద్ద నగల దుకాణానికి వచ్చారు. బంద్ గురించి తెలిసి దుకాణ యజమాని ఇంటికి వెళ్లి నగల కోసం అడిగారు. యూనియన్ నిబంధనల ప్రకారం దుకాణాలు తెరవకూడదని, తాను చేయగలిగిందేమీ లేదని ఆయన చేతులెత్తేశారు. రాత్రి పది గంటల తర్వాతైనా దుకాణం తెరిచి నగలు అమ్మమని, కనీసం మంగళ సూత్రానికైనా బంగారం అమ్మమని పెళ్లింటి వారు బతిమాలారు. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉంది. పెళ్లిళ్లకు కచ్చితంగా కొత్త బంగారమే వాడతారు. అందులోకి మంగళ సూత్రానికి విధిగా కొత్త బంగారం కావాల్సి రావటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎవరైనా బంధువులు, స్నేహితులు గతంలో కొనుగోలు చేసిన కొత్త బంగారం ఉందేమోనని కొందరు అన్వేషణలో పడ్డారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం మార్కెట్లకు బంగారం కొనుగోలుకు వచ్చి నిరాశతో తిరిగి వెళుతున్న వినియోగదారుల సంఖ్య శుక్రవారం ఎక్కువగా కనిపించింది. మరో పక్క ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసేవరకూ బంద్ విరమించేది లేదనిముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల బులియన్ యూనియన్ల నుంచి సంకేతాలు వస్తున్న క్రమంలో ఈ బంద్ మరిన్ని రోజులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
బంగారం వర్తకుల బంద్
శేరిలింగంపల్లి (హైదరాబాద్) : బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శేరిలింగంపల్లి జ్యూయెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. కేంద్రం వైఖరికి నిరసనగా శేరిలింగంపల్లి జ్యుయెలరీ షాపులను మూసివేశారు. తారానగర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎక్సైజ్ డ్యూటీని విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎక్సైజ్ సుంకంతో జ్యూయెలరీ వ్యాపారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. -
పుత్తడిపై ఎక్సైజ్ సుంకం తొలగించండి
బంగారు వర్తకుల సమ్మె చెన్నై: పుత్తడి అభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధించడాన్ని నిరసిస్తూ బంగారు వర్తకుల మూడు రోజుల సమ్మె బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సమ్మె కారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్, తమిళనాడుసహా దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో బంగారు ఆభరణాల షాప్‌లు మూతబడ్డాయని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) తెలిపింది. ఈ సమ్మె కారణంగా రూ.600-700 కోట్ల విలువైన వ్యాపారం దెబ్బతిన్నదని జీజే ఎఫ్ జోనల్ చైర్మన్(సావరిన్ రీజియన్) ఎన్. అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. బంగారు ఆభరణాల రంగం నుంచి మరింగా పన్ను ఆదాయం పెంచుకోవాలంటే వ్యాట్, లేదా కస్టమ్స్ సుంకాన్ని పెంచుకోవాలని సూచించారు. గతంలో పసిడి నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఎక్సైజ్ అధికారుల వేధింపులు అధికమయ్యాయని, తాజాగా 1 శాతం ఎక్సైజ్ సుంకం విధింపు కారణంగా ఇవే పరిస్థితులు పునరావృతమవుతాయని, పైగా స్మగ్లింగ్ కూడా పెరిగిపోతుందని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ సురీందర్ కుమార్ జైన్ పేర్కొన్నారు. -
తుపాకీతో బెదిరించి రూ.82 లక్షల దోపిడీ
ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద నిందితులను పట్టుకున్న పోలీసులు నిందితుల్లో ముగ్గురు ప్రకాశం జిల్లా ఏఆర్ కానిస్టేబుళ్లు? బాధితులు కావలికి చెందిన బంగారు వ్యాపారులు కావలి : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో కావలి నుంచి నెల్లూరుకు వెళుతున్న పట్టణానికి చెందిన బంగారు వ్యాపారులను తుపాకీతో బెదిరించి గురువారం రూ.82 లక్షలు దోచుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పీసీపల్లి వద్ద పట్టుకున్నట్లు తెలిసింది. వారు ముగ్గురు కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు. మరో వ్యక్తి పారిపోగా అతను స్టువర్ట్పురం వాసిగా తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బంగారు వ్యాపారులు వేమూరి రాములు, బి.సునీల్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో కావలి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు. వారి వద్ద సుమారు రూ.82 లక్షల నగదు ఉంది. వారి వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని తుపాకిని చూపి బెదిరించారు. మీమీద అనుమానంగా ఉందని వ్యాపారులకు చెప్పి తమ వెంట కావలి డీఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు. పడుగుపాడు సమీపంలో నవజీవన్ రైలు నెమ్మదిగా వెళ్తుండగా వారు ఇద్దరు వ్యాపారులను దించారు. వారిని అక్కడ నుంచి ఆత్మకూరు బస్‌స్టాండ్‌కు తీసుకొచ్చి, అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని కావలి వైపుకు బయలు దేరారు. దగదర్తి మండలం దామవరం సమీపంలో వ్యాపారులిద్దరినీ దించి వేసి, ఆ కారులో నేరుగా ప్రకాశం జిల్లా గుడ్లూరుకు వెళ్లారు. అంబాసిడర్ కారు డ్రైవర్ మల్లికార్జున తాను ఇక్కడి నుంచి రాను అనే సరికి వారు ఆ కారుని దిగారు. ఆ సమయంలో గుడ్లూరు బస్టాండువద్ద ఉన్న ఓ సుమో ఉండగా దానిపై ఉన్న నంబర్‌ను చూసి డ్రైవర్‌కు ఫోన్ చేయగా అతను ఎత్తలేదు. దీంతో గుడ్లూరు బస్‌స్టాండ్‌కు వెళ్లి బస్సులో కందుకూరుకు వెళ్లారు. కందుకూరు నుంచి తాము సీఎం బందోబస్తుకు వెళ్లాలంటూ ఓ ఇండికా కారు డ్రైవర్ మీరావలికి చెప్పి ఆ కారులో వారు కందుకూరు నుంచి కనిగిరికి వైపుకు వెళ్లారు. ఈ క్రమంలో దోపిడీకి గురైన వ్యాపారులు కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఒకటో పట్టణ సీఐ వెంకట్రావు, ఇతర పోలీసులు బలగాలు జాతీయ రహదారి వెంట గాలింపు చేపట్టాయి. ప్రకాశం జిల్లా చేవూరు పోలీస్ చెక్‌పోస్టు వద్ద నిందితులు ప్రయాణించిన అంబాసిడర్ కారు కనిపించడంతో దానిని పోలీసులు ఆపారు. డ్రైవరు మల్లికార్జునను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందుతుల వివరాలను తెలుసుకున్నారు. వెంటనే గుడ్లూరు, కందుకూరు, కనిగిరి మండలా ల్లో గాలింపు చర్యలు చేపట్టారు, కనిగిరి మండలం పీసీ పల్లి వద్ద వారుకారులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా ఓ వ్యక్తి పరారయ్యాడు. ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురిలో వెంకటసుబ్బయ్య, నాగరాజు ఒంగోలు కానిస్టేబుళ్లుగా, రవి అనే వ్యక్తి చీరాల కానిస్టేబుల్‌గా అనుమానిస్తున్నారు. పారిపోయిన వ్యక్తి స్టువర్ట్‌పురానికి చెందిన వాడిగా తెలుస్తోంది. రూ.82 లక్షల నగదులో సుమారు రూ.3వేల వరకు వారు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కందుకూరు డీఎస్పీ కార్యాలయానికి, అక్కడ నుంచి కావలికి తరలించినట్లు తెలిసింది. ఎస్పీ, డీఎస్పీతో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి బంగారు వ్యాపారులు దోపిడీకి గురయ్యానే విషయాన్ని వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చీదెళ్ల కిషోర్‌గుప్తా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఫోన్లో తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే విషయం తెలిసిన వెంటనే నిందితులను వెంటనే పట్టుకోవాలని ఎస్పీ, డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నిందితులను పట్టుకున్నారని తెలియడంతో పోలీసులకు అభినందనలు తెలిపారు. ఎస్పీ ఎదుట నిందితుల హాజరు? నెల్లూరు(క్రైమ్): కావలికి చెందిన బంగారు వ్యాపారులు సునీల్, రామయ్యను దోపిడీ ఘటనలో నిందితులను గురువారం రాత్రి పోలీసులు ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ ఎదుట హాజరుపరిచిన ట్లు సమాచారం. అనంతరం నిందితులను రహస్యప్రదేశానికి తరలించి విచారణ చేపట్టినట్లు తెలిసింది. మీడియా ప్రతినిధులకు నిందితులను చూపిం చేందుకు పోలీసు అధికారులు నిరాకరిం చారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించినట్లు తెలిసింది. -
దోపిడీని ఛేదించిన పోలీసులు
-
రూ.82లక్షల దోపిడీని ఛేదించిన పోలీసులు
కావలి : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులమని చెప్పి వ్యాపారుల నుంచి భారీగా నగదు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ చేసిన రూ.82 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. వ్యాపారులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.82 లక్షలు దోచుకు వెళ్లిన నలుగురు దుండగుల్లో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు కావటం విశేషం. వీరంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. కాగా కావలికి చెందిన వ్యాపారులు కొందరు గురువారం బంగారం కొనేందుకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో నెల్లూరుకు బయలుదేరారు. అదే రైలులో ఎక్కిన నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ వారి వద్దకు వచ్చారు. తనిఖీ చేయగా వ్యాపారుల వద్ద నగదు కనిపించింది. అందుకు సంబంధించి రుజువులు చూపాలని ఆగంతకులు వారిని బెదిరించారు. వ్యాపారుల వద్ద ఉన్న మొత్తం రూ.82 లక్షలను లాక్కుని...నెల్లూరు నుంచి వారందరినీ కారులో ఎక్కించుకుని దగదర్తి మండలం దామవరం దగ్గర వదిలేశారు. అనంతరం ఆగంతకులు ప్రకాశం జిల్లా గుడ్లూరు వైపు వెళ్లి, కారును అక్కడ వదిలేశారు. బాధితులు కావలి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీని కొన్ని గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. -
పోలీసుల పేరుతో రూ.82 లక్షల దోపిడీ!
నెల్లూరు: కొందరు దుండగులు పోలీసుల పేరుతో 82 లక్షల రూపాయలు దోపిడీ చేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. రైలులో పలువురిని వారు తనిఖీ చేశారు. ఇద్దరు బంగారు వ్యాపారులు రామయ్య, మరొకరిని కూడా తనిఖీ చేశారు. రైలు పడుగుపాడు వద్దకు రాగానే విచారణ పేరుతో వారు ఆ వ్యాపారులను కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. కారు దామవరం వద్దకు వెళ్లిన తరువాత, వ్యాపారుల వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకొని వారిని కిందకు తోసి పారిపోయారు. వ్యాపారులు కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యాపారులు బంగారం కొనుగోలుకు చెన్నై వెళుతుంటారు. ఈ విషయం తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.