![GST on Sale of second hand gold jewellery purchased from individuals - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/19/WOMEN.jpg.webp?itok=-4gofJ_2)
న్యూఢిల్లీ: బంగారం వర్తకులు వాడిన బంగారం విక్రయించగా వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక రాష్ట్ర ఆథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేసింది. బెంగళూరుకు చెందిన ఆద్య గోల్డ్ ప్రైవేటు లిమిటెడ్ దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ తీర్పునిచ్చింది. వ్యక్తుల నుంచి వినియోగించిన బంగారం లేదా బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి.. వాటిని అదే రూపంలో విక్రయించినప్పుడు.. ధరల మధ్య తేడాపైనే జీఎస్‌టీ చెల్లిం చాలా? అని ఆద్య గోల్డ్ తన దరఖాస్తులో స్పష్టత కోరింది. దీంతో రూపం మార్చకుండా యథాతథంగా విక్రయించిన సందర్భాల్లో కొనుగోలు, విక్రయం ధరల మధ్య తేడాపైనే జీఎస్‌టీ చెల్లించాలని ఏఏఆర్ స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల వాడిన బంగారం (సెకండ్‌హ్యాండ్) విక్రయంపై జీఎస్‌టీ భారం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment