పాత శ్రీకాకుళం: కేంద్రం తన పంతం నెగ్గుంచుకొంది. దేశవ్యాప్త బంగారు వర్తకులఆందోళనలో భాగంగా జిల్లాలో పది రోజులుగా చేపట్టిన బంద్ ఎట్టకేలకు ముగిసింది. శుక్రవారం నుంచి యథాతధంగా దుకాణాలను తెరిచేందుకు బంగారం వర్తకులు సిద్ధమయ్యారు. వారం రోజులుగా బంగారం దుకాణాలు మూత పడడంతో వర్తకులు నష్టాన్నే చవిచూశారు తప్ప అనుకున్న ఫలితాన్ని రాబెట్టుకో లేకపోయారు. దీంతో మొర్రోమంటూ బంగారు వర్తకులంతా వెనుదిరిగారు.
గురువారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన సమావేశంలో అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికీ అవి నిరాశ పరిచాయని ఓ వ్యాపారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. చేసేదిలేక శుక్రవారం నుంచి జిల్లాలోని షాపులన్నింటినీ తెరిచేందుకు సిద్ధమయ్యారు. అసలే పెళ్లిళ్ల సీజన్, ఆపై ముంచుకొస్తున్న మంచి మహూర్తాలు, ఈ సమయంలో షాపులు తీయకపోతే అసలుకే ఎసరు పడుతోందన్న భ యంతో షాపులు తీసేందుకు వర్తకులంతా సిద్ధమయ్యారు. ఈనెల 20 నుంచి ఏప్రిల్ చివరి వరకూ పెళ్లి మహూర్తాలు వస్తున్నాయి. ఈ సయంలో షాపులు తీయకపోతే వర్తకులకు నష్టంతోపాటు, పెళ్లిళ్లు చేసేవారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.
రూ.2 కోట్ల నష్టం
జిల్లాలో 300 బంగారం వ్యాపారం షాపులకు సుమారు రూ.2 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇందులో షాపుల అద్దెలే కాకుండా సిబ్బంది జీతాలు కుడా తీయాల్సి వుంది. పెద్దపెద్ద షాపులకు రోజుకు లక్షల్లో వ్యాపారం జరిగినా చిన్న షాపులకు కుడా సుమారు రూ.30 నుంచి 50 వేల మధ్యలో వ్యాపారం జరగుతుండేది. దీంతో ఏకధాటిగా పదిరోజులు షాపులు బంద్ చేయడంతో రూ.2 కోట్లపైనే నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
ముగిసిన బంగారం వ్యాపారుల బంద్
Published Fri, Mar 18 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement