
సాక్షి, విజయనగరం : నిరుద్యోగ యువకులను బురిడీ కొట్టించిన ఓ నకిలీ పోలీసును భీమవరం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చీపురుపల్లికి చెందిన ప్రసాద్ ఎస్‌ఐగా చలామణి అవుతూ గుట్లపాడుకు చెందిన ముగ్గురు యువకులకు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. వారివద్ద నుంచి రూ.24వేల చొప్పున వసూలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి పోలీస్ యూనిఫామ్, బొమ్మతుపాకీ, లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment