పోలీసులమంటూ వచ్చి..దోచుకుపోయారు | fake police hulchal in prakasam district | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ వచ్చి..దోచుకుపోయారు

Published Sat, Apr 23 2016 10:42 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

fake police hulchal in prakasam district

మేదరమెట్ల: బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులమంటూ అడ్డుకుని తీవ్రంగా కొట్టి డబ్బు దోచుకు పోయారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలివీ... ఒంగోలులోని వీఎన్‌ఎస్ దాల్‌మిల్లులో కొప్పర్తి సుబ్బారావు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం రాత్రి అద్దంకి నుంచి బైక్‌పై ఒంగోలు బైక్‌పై వెళ్తున్నాడు. మేదరమెట్ల వద్ద ఆయన్ను బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అడ్డుకున్నారు. పోలీసులమని చెప్పి డబ్బులివ్వాలని బెదిరించారు. కానీ, ఎదురు తిరగటంతో వారు అతనిని తీవ్రంగా కొట్టి, అతని వద్ద ఉన్న రూ.1.52 లక్షలను దోచుకుని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన స్ధానికులు సుబ్బారావును ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement