ముసుగులు ధరించిన షోలాపూర్ దొంగలు..సీసీపుటేజీలో రికార్డు అయిన దృశ్యం
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు నగరంలో షోలాపూర్ దొంగల ముఠా హల్ చల్ చేసింది. శాంతినగర్ ఎనిమిదవ రోడ్డులో ఓ చేపల వ్యాపారి ఇంట్లో నిన్న(గురువారం) అర్దరాత్రి దొంగతనానికి విశ్వ ప్రయత్నం చేశారు. ముఖానికి అడ్డంగా ముసుగులు కట్టుకుని...నిక్కర్లు, షార్టులు ధరించి ఇంటి ఆవరణంతా కలియదిరిగారు. దొంగల వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. సీసీ పుటేజీలో దొంగల విజువల్స్ స్పష్టంగా రికార్డు అయ్యాయి.
ఆరుగురు సభ్యులు గోడదూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్లు రికార్డు అయింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ముఠా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. షోలాపూర్ దొంగల ముఠా ఏలూరు నగరంలో సంచరిస్తున్నారని విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment