రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు | tdp leaders hulchal in yalakuntla | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు

Published Fri, Sep 2 2016 11:08 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

tdp leaders hulchal in yalakuntla

కనగానపల్లి : కనగానపల్లి మండలం ఎలకుంట్లలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతిని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ వర్గీయులు చెలరేగిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జనార ్దన్‌రెడ్డి, బయపరెడ్డి, రవీంద్రారెడ్డి, నందమోహన్‌రెడ్డి, నాగరాజుపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు.

ఎలకుంట్ల సహా బద్దలాపురంలో జరుగుతున్న వైఎస్సార్‌ వర్ధంతి సభలో పాల్గొనేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై స్థానిక బీసీ కాలనీలో పొంచి ఉన్న టీడీపీ కార్యకర్తలు వసంత్, ప్రవీణ్, ప్రసాద్, నారాయణ, వెంకటేశ్‌ సహా మరో 15 మంది కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. ఘటనలో జనార్టనరెడ్డి, బయపరెడ్డి, నందమోహన్‌రెడ్డిలకు గాయలయ్యాయి. ఈ ఉదంతంలో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకూ గాయాలైనట్లు తెలతిసింది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో రామగిరి సీఐ యుగంధర్, నలుగురు ఎస్‌ఐలు ఎలకుంట్ల గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement