వజ్రకరూరు : గూళ్యపాళ్యం గ్రామంలో బుధవారం సాయంత్రం చిరుత మళ్లీ కనిపించింది. నాలుగు రోజుల క్రితం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందడంతో పాటు గుర్రంపై కూడా దాడి చేసి గాయపరచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్‌ఐ జనా ర్దన్‌నాయుడు గ్రామంలో పర్యటించి కొండ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్టు ఆఫీసర్ నాగభూషణం, ఫారెస్టు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.