gulyapalem
-
మళ్లీ చిరుత కలకలం
వజ్రకరూరు : గూళ్యపాళ్యం గ్రామంలో బుధవారం సాయంత్రం చిరుత మళ్లీ కనిపించింది. నాలుగు రోజుల క్రితం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందడంతో పాటు గుర్రంపై కూడా దాడి చేసి గాయపరచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్ఐ జనా ర్దన్నాయుడు గ్రామంలో పర్యటించి కొండ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్టు ఆఫీసర్ నాగభూషణం, ఫారెస్టు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
గూళ్యపాళ్యంలో చిరుత కలకలం
గూళ్యపాళ్యం (వజ్రకరూరు) : మండల పరిధిలోని గూళ్యపాళ్యం గ్రామంలో ఆదివారం చిరుత కనపడటంతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. గ్రామ సమీపంలో ఉన్న కొండపై చిరుత కూర్చుని ఉన్న దృశ్యాన్ని గ్రామస్తులు గమనించారు.చిరుత ఉన్న విషయం దావనంలా వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చిరుతను చూసేందుకు గుమిగూడారు. అనంతరం చిరుత అక్కడి నుంచి కొండలో ఉన్న గుహలోకి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. సాయంత్రం కూడా మరోమారు చిరుత గుహలో నుంచి బయటకు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుత సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ జనార్ధన్ నాయుడు అక్కడకు చేరుకుని చిరుత సంచారం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.