జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గంలో భారీ సభ ఏర్పాటు చేసి .... జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. తమ నియోజకవర్గానికి కూడా వైఎస్ జగన్ ఎంపీ కాబట్టి.... నియోజకవర్గ సమస్యలు చర్చించినట్లు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.