మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
ఎర్రగుంట్ల : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అండతో..ఆయన బొమ్మతోనే మీకు రాజకీయ జీవితం వచ్చిందని , వైఎస్సార్ సీపీ జెండాతో గెలిచి కేసుల మాఫీ కోసం టీడీపీలోకి వెళ్లారని వైఎస్సార్ సీపీ కడప పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహుబూబ్ వలి ధ్వజమెత్తారు. శనివారం ఎర్రగుంట్లలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో కేవలం 5 వేల మెజార్టీ అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డికి వచ్చిందని, 2014 ఎన్నికల్లో డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి మద్దతు ఇవ్వడంతో పది వేల మెజార్టీ వచ్చిన విషయాన్ని మంత్రి ఆది సోదరుడు జయరామిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రాజీనామ చేశాకే పార్టీ మారుతామని చెప్పిన మంత్రి ఆది ఎందుకు రాజీనామ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగానే ఆసెంబ్లీలో కొనసాగుతున్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. మా నాయకుడు సుధీర్‌రెడ్డిని విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు.
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచిన విషయం తెలియదా అని అన్నారు. పార్టీ ఫిరాయింపు దారులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు అంటూ కోట్లాది రూపాయాల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసుబై బ్రదర్స్, ముద్దనూరు మైనార్టీ నాయకులు ఖాదర్‌ఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment