మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు
ఎర్రగుంట్ల: వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డిని విమర్శించే అర్హత , పార్టీ ఫిరాయింపులు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులకు లేదని మైసురారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు డి. సూర్య నారాయణరెడ్డి, పద్మనాభయ్య, నాగన్న, కడప పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎర్రగుంట్లలో విలేకరులతో వారు మాట్లాడారు. మా నాయకుడు సుధీర్‌రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు, గ్రామాల్లో ఉన్న కార్యర్తల పేర్లను చెప్పగలరన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గ్రామాల పేర్లే చెప్పగలరని, కార్యకర్తల పేర్లను చెప్పగలరా అని ప్రశ్నించారు. సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
అయితే తాను అభివృద్ధిపనులు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎర్రగుంట్లలో కళాశాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో వచ్చినవే అని అన్నారు. వైఎస్సార్‌సీపీలో గెలిచి స్వార్థం కోసం పార్టీ ఫిరాయించిని మంత్రి ఆది వర్గీయులకు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సాయం కోసం ఎవరు వచ్చినా అండగా ఉండే నైజం సుధీర్‌రెడ్డిడి అని అన్నారు. మంత్రి ఆది వర్గీయులు లోపల వైఎస్సార్‌సీపీ ఉంటే, బయట టీడీపీ ఉంటుందని విమర్శించారు. నిజమైన టీడీపీ వారు కాదన్నారు. ప్రజాభిమానం పొందుతున్న సుధీర్‌రెడ్డిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని, అ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో షర్ఫద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment