రిలే దీక్షలకు మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ఎస్టీసెల్ నాయకులు
రాయచోటి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట ఫలితంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ నాయకులు నినదించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా బీసీ శాఖ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ అధ్యక్షతన పట్టణం, మండల పరిధిలోని బీసీ నాయకులు దీక్షలో కూర్చొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదనమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే శరణ్యమన్నారు.
ప్రత్యేకహోదా కేటాయింపులో బీజేపీ, టీడీపీ రాష్ట్రానికి తీవ్ర మోసం చేశాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చొన్నారని, ఈ విషయంలో టీడీపీ కూడా చిత్తశుద్ధితో ఎంపిల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరం ప్రారంభం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రత్యేకహోదా కోసం చేపట్టిన రిలే దీక్షా శిబిరానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నసిబూన్‌ఖానమ్, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజ్ రహిమాన్, కొలిమి చాన్‌బాషా, లయన్ నాగేశ్వరరావు, అన్వర్‌బాషా, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుండా సురేంద్ర, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అఫ్జల్‌అలీఖాన్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టరు బుల్లి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి కిషోర్, జగన్ యువసేన నాయకులు సురేష్‌కుమార్‌రెడ్డి, విక్కీ, దేవేంద్రకుమార్, మహేష్, లాలాదాస్, సాదిక్, మండెం ప్రసాద్, హేమంత్‌నాయక్, గిరివర్దన్ దీక్షల్లో కూర్చొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment