బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు | Chandrababu Naidu's Tdp and Nda is Failure Special Status | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

Published Fri, Apr 13 2018 10:57 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Chandrababu Naidu's Tdp and Nda is Failure Special Status - Sakshi

 దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుమోహన్‌

బద్వేలు అర్బన్‌ : ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగసాని గురుమోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి అందూరి రామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ  స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలలో అట్లూరు మండల నాయకులు పాల్గొని.. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ప్రత్యేక హోదా సంజీవని కాదని కారు కూతలు కూసిన చంద్రబాబు, నేడు హోదా కావాలని తన ఎంపీలతో నాటకాలు వేయిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని అన్నారు. హోదా కోసం తమ ఎంపీలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటం చరిత్రాత్మకం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బద్వేలు మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షులు జి.సుందర్‌రామిరెడ్డి, అట్లూరు మండల కన్వీనర్‌ మల్లికార్జునరెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, జయరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, మాజీ జెడ్పీటీసీ చెవుల రమణయ్య, అట్లూరు మండల నాయకులు మాధవరెడ్డి, ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి, కొల్లు సుబ్బారెడ్డి, క్రిష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, గంగయ్య, సుబ్బయ్య, పెంచలయ్య, చిన్న, బాలయ్య, వెంకటసుబ్బయ్య, హజరత్, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శులు పుత్తా శ్రీరాములు, సింగసాని శివయ్య, సాంబశివారెడ్డి, మున్సిపాలిటీ నాయకులు ఈవై ఎద్దారెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి, ఆర్‌.శ్రీనివాసులు యాదవ్, వెంకటరత్నం, బిజ్జం రమణ, జయరామ్‌ యాదవ్, చెన్నక్రిష్ణారెడ్డి, బీమారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, గుజరాత్‌ యాదవ్, రామచంద్రయాదవ్, ప్రసాద్‌ నాయుడు, రోశిరెడ్డి, హసాన్, అనిల్, చెన్నయ్య, ఇమ్మానియేల్, సిద్ధువెంకట సుబ్బారెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement