అవినీతిలో ‘ఆది’పత్యం | Sakshi
Sakshi News home page

అవినీతిలో ‘ఆది’పత్యం

Published Wed, May 1 2024 6:19 AM

Adinarayana Reddy List of Irregularities: Andhra Pradesh

నాడు గర్భశోకంతో విలవిలలాడిన పెన్నానది 

గ్రావెల్‌ కోసం కొండలు, గుట్టలు యంత్రాలతో పెకళింపు 

జీఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ పనుల్లో లభించిన బండరాళ్లతో కంకర  

ఎలాంటి సుంకం చెల్లించకుండా కోట్లాది రూపాయల దోపిడీ  

వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు స్వాహా  

నీరు–చెట్టు పథకంలో భారీ అక్రమాలు

ఆయనో మాజీ మంత్రి. సొంత పేరు కంటే.. పేకాట పాపారావంటే స్థానిక ప్రజలు సులభంగా చెప్పేస్తారు. సోదరుడిని, ఆయన తయారు చేసుకున్న వర్గాన్ని అణగదొక్కి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్‌ భిక్షతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మరణం తర్వాత విచ్చలవిడి దోపిడీకి బరితెగించారు. గండికోట ప్రాజెక్టు, గాలేరు–నగరి సొరంగం పనుల కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లలో దోచుకున్నారు.

కాలువ తవ్వకాల్లో వచి్చన బండరాళ్లను కూడా వదల్లేదు. కంకరగా మార్చి అక్రమార్జన చేశారు. పక్క రాష్ట్రానికి ఇసుక తరలించేందుకు పెన్నానదికి గర్భశోకం కలిగించారు. నీరు–చెట్టు పథకంలో ఆయన దోపిడీకి అడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నమ్మినవారిని నట్టేట ముంచడం,పారీ్టలు మారడం అంటే ఆయనకు మంచినీళ్లు తాగినంత సులభం.

సాక్షి టాస్క్ ఫోర్స్‌: ‘‘జమ్మలమడుగులో వర్గ పోరాటం కొనసాగించాం. మా సర్వస్వం కోల్పోయాం. ఆస్తులు కూడా తాకట్టులో ఉన్నాయి. ఒక్క అవకాశం ఇవ్వండి..’’ అంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గెలిచారు. ఆ తర్వాత ఆయన సాగించిన దోపిడీతో రాష్ట్రంలోనే అత్యధిక సంపాదనాపరుల్లో ఒకరిగా మారారు. ప్రకృతి వనరుల దోపిడీలో ఆయన జోరు చూసి నియోజకవర్గ ప్రజలే నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ, కొండ పోరంబోకు భూములను వందల ఎకరాలు స్వాహా చేసి, తన సాగులోకి చేర్చుకున్నారు. సోలార్‌ ప్రాజెక్టు పనుల్ని శాసించారు. చివరికి గండికోట నిర్వాసితుల చెక్కుల్నీ స్వాహా చేశారు. చెప్పుకుంటూ పోతే.. ఆయన అక్రమాలకు లెక్కే లేదు. ఇప్పుడు కేంద్ర పారీ్టలో చేరి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.  

ప్రతి అవకాశం.. ఆదాయ మార్గం
దేవగుడి, గొరిగనూరు, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె, చలివెందుల, సుగమంచుపల్లె, ధర్మాపురం గ్రామాల్లో ఈ నేత కుటుంబ ఆధిపత్యం యథేచ్ఛగా సాగుతోంది. అనూహ్య పరిస్థితుల్లో అమాత్యుని హోదా దక్కించుకున్నారు. ఇంకేముంది ఆయా గ్రామాల పరిధిలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బెంగళూరు తదితర ప్రాంతాలకు భారీ వాహనాలతో ఇసుకను తరలించారు. కేవలం ఇసుక తరలింపుతోనే రూ.వందల కోట్లు ఆర్జించారు.

పేకాట పాపారావు 
ఈయనకు స్థానికంగా మరో పేరు కూడా ఉంది. పేకాట పాపారావుగా బాగా ప్రసిద్ధి. 2019 ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పేకాట కోసం బెంగళూరు క్లబ్బును తన నివాసంగా మార్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లూ నమ్ముకున్న కార్యకర్తలకు దూరంగా పత్తాలేకుండా పోయారు. ఆ మధ్య ఓ చానల్‌ ఇంటర్వ్యూలో కూడా తన జూద ప్రావీణ్యతను మహ సరదాగా చెప్పుకొచ్చారు.

ఆ నేతపై ఉన్న కేసుల్లో కొన్ని 
ఈ నేతపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి.  
∗ 2020లో క్రైమ్‌ నెం.130 పేరిట 143, 144, 147, 148, 323, 324, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  
∗ మైదుకూరు పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ నెం.239/2020 కేసు ఉంది. 
∗ తుళ్లూరులో క్రైమ్‌ నెం.65/2023 ఐపీసీ 294, 504, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సదరు నేత తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు.

ప్రభుత్వ భూములు స్వాహా.. 
ఈ మాజీ అమాత్యుని కుటుంబ సభ్యులు పెన్నానది ఇసుకతో సరిపెట్టుకోలేదు. ఇసుక తరలిపోగా ఏర్పడిన గట్టి ప్రాంతాన్ని వ్యవసాయ భూములుగా మార్చి, సాగులోకి తెచ్చారు. సమీప బంధువుల పేరిట సున్నపురాళ్లపల్లె సమీపంలో 300 ఎకరాలు సాగుచేసి అనుభవిస్తుండగా, అవి స్టీల్‌ ప్లాంట్‌ పరిధిలోకి వెళ్లాయి. సర్వే నెం.411లో కొండపోరంబోకు భూమిని ఆక్రమించి బినామీల పేర్లతో సాగు చేసుకునేవారు. సర్వే నెం.64లో గొరిగనూరు గ్రామానికి చెందిన ఈతని బంధువు సబ్‌ డివిజన్‌ చేయించి మరీ భూముల్ని ఆక్రమించారు. దేవగుడి ఆధిపత్య గ్రామాల్లో ఈ కుటుంబం వందలాది ఎకరాల కొండ ప్రాంతాన్ని ఆక్రమించి సొమ్ము చేసుకుంది.

‘డైమన్షనల్‌’దందా 
టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈయనకు అడ్డూఅదుపూ లేదు. మైలవరం మండలంలోని కొండల్లో విలువైన, అరుదైన ఖనిజాలు లభిస్తాయి. అందులో డైమన్షనల్‌ స్టోన్‌ ఒకటి. ఆ రాయిని శిల్పాలు, దేవాలయాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఒక్కొ టన్ను ధర రూ.వేలల్లోనే. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా తరలించారు. రూ.కోట్లలో ఆర్జించారు.

గ్రావెల్‌ అక్రమ రవాణా 
స్థానికంగా అడ్డుకునే వారు లేకపోవడంతో.. నియోజకవర్గ పరిధిలోని శిరిగేపల్లి, సున్నపురాళ్లపల్లె కొండల్లో రోడ్లకు ఉపయోగపడే గ్రావెల్‌ను ఈ మాజీ అమాత్యుని సమీప బంధువే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పొక్లెయినర్ల సాయంతో కొండలు, గుట్టల్ని పెకలించేశారు. క్రషర్‌ ద్వారా కంకరగా మార్చి సొమ్ము చేసుకున్నారు.

పాలూరు ఎత్తిపోతల పథకం చేపట్టిన కోయా కంపెనీ, సుజిలాన్‌ పవర్‌ విండ్‌ ప్రాజెక్టుతోపాటు సోలార్‌ కంపెనీ యాజమాన్యం నుంచి ఎన్నికల ఖర్చుల పేరిట దందాల ఆరోపణలూ ఉన్నాయి. ఎన్టీపీసీ సోలార్‌ ప్రాజెక్టు ఎర్త్‌ పనులు ఈ కుటుంబం కనుసన్నుల్లోనే జరిగాయి. నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు పనులు జరిగితే, అందులో సగం సొమ్ము ఈయన సన్నిహితుల జేబులోకే వెళ్లినట్లు సమాచారం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement