
`జగన్ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు`
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు. ఈ శంఖారావం సభలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి, జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర విభజన పాపం కిరణ్, చంద్రబాబులదేనని వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని.. దేశవ్యాప్తంగా ఆలోచింప చేసిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని తెలిపారు.