Samaikya Sankaravam
-
అబద్దాలు ఆడేస్టాయికి చంద్రబాబు దిగజారారు
-
రాష్ట్రపతిని కలుస్తాం
-
ఈ పోరాటం ఆగదు: వైఎస్ జగన్
చిత్తూరు: టి. బిల్లును ఢిల్లీకి తిప్పిపంపినా విభజనపై పోరాటం ఆగిపోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిస్తూ చేపట్టిన సమైక్య శంఖారావంలో భాగంగా చంద్రగిరి సభలో ప్రసంగించిన జగన్.. విభజన బిల్లుపై అసెంబ్లీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ పోరాటమే కారణమన్నారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని జగన్ తెలిపారు. పార్లమెంటుకు బిల్లు పంపొద్దని ఆయన్ను కోరతామని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రపతిని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాబోయో ఎన్నికల్లో మనమంతా ఒక్కటై 30 స్థానాలు తెచ్చుకున్నాక రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవ్వరికి ఉండదన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడతామని అన్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు కుమ్మక్కై ప్యాకేజీ లు అడుగుతున్నారని జగన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా ఓడించాలని వైఎస్ జగన్ చెప్పారు. -
విశ్వసనీయతకు వైఎస్ఆర్ వన్నె తెచ్చారు
-
`రాజకీయాల్లో విలువలు పడిపోయాయి: వైఎస్ జగన్
చిత్తూరు: విశ్వసనీయత, నిజాయితీకి నేడు రాజకీయాల్లో విలువలు పడిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి నాలుగేళ్లు అయిన ఆయన ప్రజల గుండెల్లోనే ఉన్నారని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ కొనసాగిస్తున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం దామినేడు సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయమంటే పదవి, ఓట్ల కోసం, సీట్ల కోసం అడ్డగోలుగా విభజించడం కాదన్నారు. ప్రతి పేదవాడు ఎదగాలని రాజకీయనాయకులకు తెలియాలని జగన్ హితువు పలికారు. గుణగణాలన్నా ఒక్కరే సీఎం అవుతారని ఆయన చెప్పారు. మరికొందరు అధికారం కోసం ఏ గడ్డైనా తింటారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మామని దింపి సీఎం అయిన తర్వాత ఏనాడైనా రైతులకు గాని, చదువుకుంటున్న విద్యార్థులకు గాని తన పాలనలో చేసిందేంటో చెప్పగలడాని జగన్ ప్రశ్నించారు. మరో నాలుగు నెలల్లో రాజన్న రాజ్యం తీసుకువస్తానని జగన్ చెప్పగలడు మరీ చంద్రబాబునాయుడు చంద్రన్న రాజ్యన్ని తెస్తానని చెప్పగలడా ? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రజల్లోకి చంద్రబాబు వెళ్తే గుడ్లు, టమాటోలతో కొడతారని అన్నారు. సీఎం అవడానికి ముందు ఇస్తున్న రెండు రూపాయల బియ్యాన్ని రూ.5కు పెంచిన ఘనత చంద్రబాబుదు కాదా అన్నారు. మద్యంపాన నిషేదం చేసి ఈనాడులో వార్తలు రాయించుకొని బెల్టుషాపులు కూడా తెరిపించిన ఘనత చంద్రబాబుది కాదా ? అని జగన్ ప్రశ్నించారు. అక్కా చెల్లెల్ల దగ్గర రూ.1.50 వడ్డీ వసూలు చేయలేదాని అన్నారు. ఇప్పుడు అధికారం కోసం రుణమాఫి అని, ఉచిత విద్యుత్ అని చెబుతున్నారని జగన్ దుయ్యబట్టారు. రైతన్నల ఆత్మహత్యలను అపహస్యం చేయలేదాని జగన్ విమర్శించారు. రూ.ఇస్తానన్నా చంద్రబాబు ఏనాడైనా పది పైసలైనా ఇచ్చాడా అన్నారు. విశ్వసనీయతను తన తండ్రి నుంచి తాను వారసత్వంగా పొందానని జగన్ చెప్పారు. ఏడమ చెత్తో సీమాంధ్ర ఎమ్మెల్యేలను, కుడి చేత్తో తెలంగాణ ఎమ్మెల్యేలను చంద్రబాబు రెచ్చగొట్టడం లేదా అని జగన్ విమర్శించారు. 44 రోజుల అసెంబ్లీ చర్చల్లో ఏనాడైనా ధరల మీద చర్చ జరిగిందానని అన్నారు. మనమంతా ఒకటై చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుద్దామని వైఎస్ జగన్ చెప్పారు. -
అసెంబ్లీని చూస్తుంటే భాధేస్తుంది
-
పావలా వడ్డీ గురించి అడిగి తెలుసుకున్న జగన్
-
'సోనియా' డ్రామాలో కిరణ్, బాబు పాత్రలు
పేద ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచి ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగలో మాట్లాడుతూ... వైఎస్ఆర్ పరిపాలించిన సువర్ణయుగం త్వరలో రాష్ట్రంలో రానుందన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. యూపీఏ ఆడించే డ్రామాలో సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు పాత్రదారులని ఎద్దేవా చేశారు. ఆమాయక ప్రజలతో సీఎం కిరణ్ ఆటలు ఆడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజల సంక్షేమ పథకాలు అటకెక్కాయన్నారు. వంట గ్యాస్ ధరలు ఆకాశానంటాయని, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే భయపడిపోయే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని పేర్కొన్నారు. -
పేదల బతుకులో మార్పుతెస్తా
-
విభజన కుట్రలిక సాగవు: వైఎస్ జగన్
* వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవుతుంది.. * పెను ఉప్పెన సృష్టిస్తుంది.. * అందులో కుట్రదారులంతా కొట్టుకుపోతారు: జగన్ ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘దివంగత నేత బతికి ఉన్నంతవరకూ ఈ రాష్ట్రంవైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ రాలేదు. ఆయన మన నుంచి దూరమయ్యాక ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కచెక్కలు చేసే కుట్రకు తెరలేచింది. ఈ కుట్రలు ఎంతోకాలం సాగవు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె ఒక్కటవుతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పెను ఉప్పెన సృష్టిస్తుంది. ఆ ఉప్పెనలో విభజన కుట్రదారులు కొట్టుకుపోవడం ఖాయం’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యూత్ర’ నాలుగో విడత 8వరోజు సోవువారం సత్యవేడు నియోజకవర్గంలో సాగింది. వరదయ్యుపాళెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం జగన్ మాటల్లోనే.. నమ్ముకున్న జనాన్నే అమ్మేస్తారు ‘‘మహానేత దూరమయ్యాక రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లో విశ్వసనీయుత అన్న పదానికి అర్థం కూడా తెలియని వారు అటు అధికార పక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ ఉన్నారు. నమ్మమకున్న జనాన్నే సీట్లు, ఓట్ల కోసం అమ్మేసేందుకు కూడా వెనుకాడని ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే బాధనిపిస్తోంది.’’ - వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని 44 రోజులుగా చర్చ ‘‘రాష్ట్ర అసెంబ్లీలో 44 రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ చర్చ పేదవారి సమస్యలపై కాదు. ఈ రాష్ట్రాన్ని ఎలా వుుక్కలు చేయూలా అన్న అంశంపై నడుస్తోంది. గ్యాస్ డీలర్ దగ్గరకు వెళితే బ్యాంకుకు వెళ్లవుంటున్నాడు. బ్యాంకు వారేమో గ్యాస్ డీలర్ వద్దకే తిరిగి పంపుతున్నారు. చివరకేమో రూ.1,500 పెడితే కానీ గ్యాస్ సిలెండర్ అందడంలేదని అక్కా చెల్లెళ్లు వాపోతున్నారు. ఈ సవుస్యపై అసెంబ్లీలో చర్చ లేదు. కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. బిల్లు ఎంత ఉందో మళ్లీ అంత మొత్తాన్ని సర్ చార్జీల పేరుతో బాదుతున్నారు. ఈ సవుస్యపై అసెంబ్లీలో చర్చ లేదు. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 జబ్బులను తీసేశారు. చిన్న పిల్లల వుూగ, చెవుడు చికిత్సకు అవసరమయ్యే ‘కాక్లియుర్ ఇంప్లాంట్’ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ నుంచి తీసేశారు. ఈ ఆపరేషన్ చేరుుంచకపోతే ఆ పిల్లవాడు జీవితాంతం మూగవాడిగానే మిగిలిపోతాడు. ఇటువంటి జబ్బులను ఆరోగ్యశ్రీనుంచి తీసేస్తే దీనిపైనా అసెంబ్లీలో చర్చలేదు. విద్యాసంవత్సరం అరుుపోవస్తున్నా ఇప్పటివరకూ ఫీజు బకారుుల చెల్లింపు జరగలేదు. దీనిపైనా చర్చ లేదు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశంపైనా చర్చ జరగడం లేదు. 44 రోజులుగా ఈ రాష్ట్రాన్ని ఎలా విభజించాలి అన్న అంశంపై వూత్రమే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితి చూస్తోంటే.. ఇది అసెంబ్లీయేనా.. అనిపిస్తోంది. కానీ ఇప్పుడు సీట్లు, ఓట్ల కోసం ప్రజలను అమ్మేసేందుకు కూడా వెనకాడని ఈ రాజకీయు నాయుకులను చూస్తోంటే బాధనిపిస్తోంది. పై నుంచి దేవుడు చూస్తున్నాడు.. దివంగత ప్రియుతవు నేత వైఎస్ ఆనాడు ఎర్రటి ఎండలో 1,500 కిలోమీటర్ల పాదయూత్ర చేసి పేదవాడి గుండె చప్పుడును అతి దగ్గర నుంచి విన్నారు. తాను వురణించాక కూడా పేదవాడి హృదయుంలో సజీవంగా ఉండాలని అనుక్షణం తపన పడ్డారు. ఆయన మన నుంచి దూరమయ్యాక ప్రజల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అసెంబ్లీలో చంద్రబాబు ఒక చేత్తో సైగచేసి సమైక్యాంధ్ర అనిపిస్తారు. అదే సమయంలో మరో చేత్తో సైగచేసి తన పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్ర విభజన డివూండ్ చేరుుస్తారు. ఇక మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గీసిన గీత దాటకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం పదవిలో ఉండేందుకు సమైక్య వుుసుగులో మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను అమ్మేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతోంది. వీరు చేసే కుట్రలు, మోసాలను పై నుంచి దేవుడు చూస్తూనే ఉన్నాడు. త్వరలో ఎన్నికలు వస్తారుు. వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై ప్రభంజనం సృష్టిస్తుంది. ఆ ప్రభంజనంలో విభజన కుట్రదారులు సోనియా, కిరణ్, చంద్రబాబు బంగాళాఖాతంలో కలసిపోతారు.’’ ఎనిమిదోరోజు యూత్ర సాగిందిలా.. సోమవారం ఉదయుం పది గంటల సవుయుంలో సత్యవేడు నియోజకవర్గంలోని రాజుల కండ్రిగ నుంచి జగన్ బయులు దేరి ఎస్.ఎస్.పురం చేరుకున్నారు. గ్రావుంలో, వైఎస్ మృతిని జీర్ణించుకోలేక గుండెపోటుతో వురణించిన దళిత వుహిళ బాలపల్లి సుబ్బవ్ము కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం జనికాపురం క్రాస్, కడివేడు గ్రామాల మీదుగా బీరకుప్పం చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత టీపీ పాళెం, రాజగోపాలపురం, తొండంబట్టు, పెద్దపాండూరు, వరదయ్యుపాళెంలలో దివంగత నేత విగ్రహాలను ఆవిష్కరించారు. వరదయ్యపాళెం బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం బుచ్చినాయిన కండ్రిగ మండలం నీర్పాకోట గ్రామానికి చేరుకుని మండల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ విద్యానంద రెడ్డి ఇంటిలో రాత్రి బస చేశారు. ఎనిమిదో రోజు యాత్రలో జగన్‌తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కె.నారాయణ స్వామి, వూజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయుకర్త ఆదిమూలం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ కుట్రలను ఛేదిద్దాం...
-
నగరి అదిరింది
-
వైఎస్ అందుకే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు..
-
పచ్చటి రాష్ట్రంపై దుష్టత్రయం
-
వారిద్దరినీ చెత్తబుట్టలో విసిరేయాలి
-
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే
-
ఆ ముగ్గురి వల్లే విభజన: వైఎస్ జగన్
* సోనియా, కిరణ్, చంద్రబాబు.. విభజన కుట్రదారులు.. * ‘సమైక్య శంఖారావం’లో జగన్ ధ్వజం * అన్యాయానికి గురవుతున్న 70 శాతం ప్రజల ఉసురు తగులుతుంది * వచ్చే ఎన్నికల్లో జనం వీరిని బంగాళాఖాతంలో కలుపుతారు.. * వైఎస్ బతికుంటే... రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసేవారా? * సోనియా తన కొడుకు కోసం.. మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపాటు ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఓట్ల కోసం, సీట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ, కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబు కలసి పచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్రకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘ఇవాళ ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతోంది. వీళ్లు చేస్తున్న పాపం ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారేమో.. విభజనతో అన్యాయానికి గురవుతున్న 70 శాతం మంది ప్రజల ఉసురు వీరికి కచ్చితంగా తగులుతుంది. పై నుంచి దేవుడు చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికల్లో ప్రజలందరం కలసి వీళ్లను బంగాళాఖాతంలో కలుపుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం. అప్పుడు రాష్టాన్ని వీళ్లెలా విభజిస్తారో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం’’ అని జగన్ పిలుపు నిచ్చారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగో విడత రెండోరోజు మంగళవారం జగన్.. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం సభల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. సోనియాకొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం.. ‘‘కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా చదువుకున్న ప్రతి పిల్లవాడి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర అని నినదిస్తోంది. సాగునీటికోసం పరితపించే ప్రతి రైతన్న గుండె చప్పుడూ సమైక్యమనే ఘోషిస్తోంది. అయితే.. కోట్లాది ప్రజల గుండెచప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకు మాత్రం వినిపించడం లేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం, తన కొడుకును ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం సోనియా గాంధీ ఇవాళ రాష్ట్రాన్ని విభజిస్తున్నారు.. ఆమె కొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి సోనియా గాంధీని పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు.. ప్యాకేజీల కోసం కుమ్మక్కైపోయారు. ఇవాళ టీవీ పెట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే.. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది. చంద్రబాబు సభలోకొస్తారు.. సీమాంధ్ర ఎమ్మెల్యేలతో ఒకవైపు సమైక్యాంధ్ర అనిపిస్తారు.. మరోవైపు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో విభజన అనిపిస్తారు. ఒక పార్టీ అన్నాక.. ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాక.. ఏ ప్రాంతంలో ఉన్న ప్రజల్లోకైనా వెళ్లి తన వైఖరి చెప్పి.. ‘మీకు నేనున్నాను.. నన్ను చూసి ఓటేయండి.. నన్ను చూసి గెలిపించండి.. నేను అభివృద్ధి చేస్తాను’ అని చెప్పే దమ్ము, ధైర్యం కూడా లేదు చంద్రబాబుకు. కిరణ్.. సోనియా గీత జవ దాటరు ఇవాళ సోనియా గాంధీ గీత గీస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి జవ దాటరు. తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు సోనియా గాంధీ చెప్పినట్లు ఆడుతున్నారు. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు, సమ్మెలు చేస్తున్న ఉద్యోగులను పిలిపించి వారిని భయపెట్టి సమ్మె విరమించుకునేలా చేస్తారు. విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చీరాగానే తాను సంతకం చేయడమే కాక, ప్రభుత్వ కార్యదర్శులందరితో సంతకాలు చేయించి కేవలం 17 గంటల్లోనే అసెంబ్లీకి పంపిస్తారు.. పైకేమో తాను సమైక్యవాదినని చెబుతారు. చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కలిసి ప్రజల జీవితాలతో నాటకాలు ఆడుతున్నారు. వీళ్లా రాజకీయ నాయకులు.. ఆ దివంగత నేత బతికున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడానికి ఏ ఒక్కరికీ ధైర్యం చాల్లేదు. విశ్వసనీయత అన్న పదానికి వైఎస్ ఒక అర్థంలా నిలిచారు. రాజకీయాల్లో నిజాయితీని చూపించారు. ఆయన బతికున్నప్పుడు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. ‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. ఎంతకాలం బతికామన్నదే ముఖ్యం’ అన్నదే ఆ మాట. ఆ మాట ఈ రాజకీయ నాయకులకు అర్థం కావాలి. ఎందుకంటే.. ఈ రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు వీళ్లా రాజకీయ నాయకులు అని జనం చీదరించుకునే పరిస్థితి.’’ రెండోరోజు యాత్ర సాగిందిలా.. జగన్ మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పుత్తూరు ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద నుంచి రెండోరోజు ‘సమైక్య శంఖారావం, ఓదార్పు’ యాత్ర ను ప్రారంభించారు. పుత్తూరు బైపాస్ రోడ్డు నుంచి నారాయణవనం చేరుకుని అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం పుత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. అడుగడుగునా అభిమానంతో ప్రజలు పోటెత్తడంతో పుత్తూరు పట్టణ పొలిమేరలు దాటేందుకే 3 గంటలకు పైగా సమయం పట్టింది. తర్వాత నెత్తం, రాజుల కండ్రిగ, చినరాజుకుప్పం, పద్మ సరసు మీదుగా రాత్రి 8 గంటల ప్రాంతంలో జగన్ కార్వేటినగరం చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలు ఆలస్యమయినప్పటికీ కార్వేటినగరంలో ప్రజలు జగన్ రాకకోసం ఎదురుచూశారు. కిక్కిరిసిన ఆ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం రాత్రి 11 గంటలకు నెలవాయి గ్రామం చేరుకుని స్థానిక నాయకుడు గోపాలనాయుడు ఇంట్లో బస చేశారు. మంగళవారం యాత్రలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమరనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు నారాయణ స్వామి, ఆర్కే రోజా, మిథున్ రెడ్డి, ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలంటే.. పేదోడి గుండెలో సజీవంగా ఉండడం రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు కాదు.. ఎత్తులు పై ఎత్తుల చదరంగం కాదు.. ఓట్లు, సీట్ల కోసం విభజించడం కాదు.. ఓ వ్యక్తిని జైల్లో పెట్టడం కాదు. రాజకీయాలంటే పేదవాడి ముఖాన చిరునవ్వు పూయించడం, సగటు బడుగు జీవి ఆకాంక్షలకు అద్దం పట్టడం, రాజకీయం అంటే విశ్వసనీయత, ఇచ్చిన మాటకోసం తుదికంటా నిలబడటం. రాజకీయమంటే చనిపోయాక కూడా జన హృదయ స్పందనల్లో సజీవంగా ఉండటం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇటువంటి విలువలతో కూడిన రాజకీయాలకు చిరునామాగా నిలిచారు. ఆయన మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండె చప్పుడులోనూ సజీవంగా ఉన్నారు. అసలు ఆ మహానేతే జీవించి ఉంటే మన రాష్ట్రాన్ని విభజించేందుకు ఎవ్వరైనా సాహసించే వారా? -
రాజకీయాలంటే ఓట్లు దండుకోవడం కాదు:జగన్
-
వడమాలపేట చేరుకున్న సమైక్య శంఖారావం
-
ఆదరణ అపూర్వం
సాక్షి, తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్.జగన్మోహన్ రెడ్డికి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రను మూడవ రోజై న మంగళవారం వాల్మీకిపురం నుంచి ప్రారంభించారు. వాల్మీకిపురంలోని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయల్దేరారు. శివపురం మీదుగా గంగాదొడ్డి చేరుకుని, వైఎస్ మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన ఒలిపి రామచంద్ర కుటుంబాన్ని ఓదార్చారు. తిరిగి వాల్మీకిపురం చేరుకుని, అక్కడ తోట వీధిలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణిం చిన రెడ్డిగౌస్ కుటుంబాన్ని ఓదార్చారు. తరువాత వాల్మీకిపురం జంక్షన్లో వేలాది మంది హాజరైన బహిరంగ సభలో ప్రసంగించారు. బస్సుపై నుంచి ప్రసంగించి, కిందకు దిగిన ఆయనను కలుసుకోవాలని వచ్చిన అభిమా నులను చిరునవ్వుతో పలకరించారు. పలువురు జననేతను చూసేందుకు మిద్దెలపైకి, చెట్లపైకి ఎక్కారు. వాల్మీకిపురం ప్రభుత్వ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు కుప్పంవాసులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారిని పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి, జగన్మోహన్రెడ్డికి పరిచయం చేశారు. వాల్మీకిపురంలో భోజనానంతరం ఆయన పునుగుపల్లె మీదుగా విఠలం చేరుకున్నారు. అక్కడ మహిళాకూలీలతో కొద్దిసేపు ముచ్చటించారు. చింతరాపల్లి క్రాస్, యమండ్లపల్లెలో రోడ్ షో నిర్వహించారు. తరువాత చింతపర్తికి చేరుకుని, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాతకోటపల్లె, బీదలవారిపల్లెలో రోడ్‌షో నిర్వహించిన జగన్మోహన్రెడ్డికి అభిమానులు హారతులు పట్టారు. గండబోయినపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత అంధులు, వికలాంగులతో ముచ్చటించారు. అక్కడి నుంచి కమ్మవారిపల్లె, బేకలకోన మీదు గా కలికిరి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇంది రమ్మ ఇళ్ల వాసులు జగన్మోహన్రెడ్డిపై పూల వర్షం కురిపించి స్వాగతించారు. నాలుగురోడ్ల జంక్షన్ వరకూ దారి పొడవునా పూలవర్షం కురిసింది. కలికిరిలో విగ్రహావిష్కరణ చేశారు. అక్కడి నుంచి పొట్టేకులవారిపల్లె, సానుకూటపల్లె క్రాస్, ఈతమాను క్రాస్, ఎల్లంపల్లె క్రాస్, గట్టుపాళెం క్రాస్, ముదినేపల్లె క్రాస్, ఊటుపల్లె మీదుగా ఆయన కందూరుకు చేరుకుని పార్టీ నాయకుడు రవీంద్రనాథరెడ్డి ఇంట్లో బస చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి యాత్ర పీలేరు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జర గగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరి శీలకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సమన్వయకర్తలు షమీమ్ అస్లాం, డాక్టర్ సునీల్ కుమార్, పూర్ణం, రవి ప్రసాద్, వై.సురేష్ పాల్గొన్నారు. నేడు జగన్ యాత్ర సాగుతుందిలా సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర బుధవారం నాటి వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. సోమల మండలంలోని కందూరు నుంచి ప్రారంభమయ్యే యాత్రలో అదే గ్రామంలో ఉదయం శెట్టి చిన్నరెడ్డెప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు. చింతలపల్లెవారి క్రాస్, బురుజుపల్లె, తెట్టుపల్లె, ఈర్లపల్లె క్రాస్, చిన్నసోమల క్రాస్‌లలో రోడ్‌షో నిర్వహిస్తారు. సోమలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అడుసుపల్లె, సరస్వతీపురం, నింజంపేట, మల్లేశ్వరపురం, రాంపల్లె, కల మండవారిపల్లె మీదుగా పట్రపల్లె చేరుకుని అక్కడ సాదం మునస్వామి కుటుంబాన్ని ఓదారుస్తారు. కమ్మపల్లె, శీలంవారిపల్లె, తంగేనిపల్లె, సవరంవారిపల్లె, గాంధీనగరం, గురి కానివారిపల్లె, చెరుకువారి పల్లె మీదు గా సదుం మండలం చేరుకుంటారు. సదుం మండలంలో ఎన్.మతుకువారిపల్లె, నడిగడ్డ, హైస్కూల్గడ్డలో రోడ్ షో నిర్వహించి యర్రాతివారిపల్లెలో రాత్రి బస చేస్తారు. -
తెలుగువారిని అడ్డగోలుగా విడగొడతారా?: వైఎస్ జగన్
-
'రాష్ట్రంతో చదరంగం ఆడుకుంటున్నారు'
చిత్తూరు : రాష్ట్ర విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆయన సోమవారం నీరుగట్టువారిపల్లెలో ప్రసంగించారు. విభజిస్తే రెండు రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. జరగబోయే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్యే ఎన్నికలు జరగనున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరిపారని జగన్ గుర్తు చేశారు. చేనేత కార్మికుల కోసం వైఎస్ రూ.320 కోట్ల రుణమాఫీ సంతకం చేశారన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఢిల్లీ పెద్దలు రాష్ట్రంతో చదరంగం ఆడుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని విద్యార్థులు...చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కాలర్ పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తీరు నీతిమాలిన విధంగా ఉందని జగన్ ధ్వజమెత్తారు. సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలది సమైక్యవాదం...మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
'రాష్ట్రంతో చదరంగం ఆడుకుంటున్నారు'
-
తీర్మానం లేకుండా విడగొడతారా?
సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్న రాష్ట్ర విభజనను దేశం మొత్తం అన్యాయం అంటున్నా కిరణ్, చంద్రబాబుకు పట్టదా? సోనియా గీసిన గీతను కిరణ్ దాటడం లేదు.. సమైక్యం పేరుతో మోసం చేస్తున్నారు ఓట్ల కోసం చంద్రబాబు వారితో కుమ్మక్కయ్యారు నీళ్ల కోసం రైతులు, ఉద్యోగాల కోసం యువత నిలదీస్తే వారికి ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబూ.. మీ నోటి నుంచి సమైక్యం అన్న మాట ఎందుకు రాదు? ఎన్టీఆర్ పథకాలను తుంగలో తొక్కి.. ఇప్పుడు దొంగ హామీలు ఇస్తున్నారు సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అసెంబ్లీ తీర్మానం లేకున్నా రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. ఇది అన్యాయం అని రాష్ట్రమే కాదు.. యావత్తు దేశం అంటోంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే ప్రజలను విడగొట్టడం ఎంత వరకు న్యాయం?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓట్లు, సీట్ల కోసం వారితో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. రైతన్నకు నీళ్లు లేకపోయినా, చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరక్కపోయినా అన్యాయం అనిపించదా అంటూ చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే.. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉండగానే పై రాష్ట్రాల్లో ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితేనేగానీ మన రాష్ట్రానికి చుక్కనీరు రాని పరిస్థితి ఉందని, ఇక మధ్యలో మరో రాష్ట్రాన్ని పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుందని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం మూడో విడత మొదటి రోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. బీ కొత్తకోట మండల కేంద్రం, అంగళ్లు గ్రామంలో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే... గీత దాటని కిరణ్.. సమైక్యం అనని బాబు.. ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం, కొడుకును ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే... ఆమె గీసిన గీత దాటకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి మనల్ని మోసం చేస్తున్నారు. సోనియాను నిలదీయాల్సిన చంద్రబాబు వాళ్లతోనే కుమ్మక్కయ్యారు. చంద్రబాబుగారూ.. మీ నోట్లో నుంచి సమైక్యం అన్న మాట ఎందుకు రావడం లేదు? మనందరం టీవీలో అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం. ఆ సమావేశాల్లో చంద్రబాబు ఏం చేస్తున్నారంటే.. సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలతో సమైక్యం అనిపిస్తాడు. తెలంగాణ ఎమ్మెల్యేల చేత విడగొట్టండి అనిపిస్తాడు. చంద్రబాబూ.. ఈ గడ్డ మీద పుట్టినందుకు మీకు నిజంగా ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉందా? రాజకీయాల్లో నిజాయితీ అన్న పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని సోనియా అనుకున్న వెంటనే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎం కిరణ్ ఎందుకు తీర్మానం చేయలేదు? దేశ చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా జరగనంత అన్యాయం ఇవాళ రాష్ట్రానికి జరుగుతోంది. కనీవినీ ఎరుగని విధంగా అసెంబ్లీ తీర్మానం అనేది లేకుండా ప్రజలను విడగొడుతున్నారు. ఈ అన్యాయాన్ని దేశంలోని ప్రతి పార్టీ ఖండిస్తోంది. దేశంలోని ప్రతి నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకు ఇది కనబడడం లేదు. విశ్వసనీయతకు అర్థం తెలియని బాబు.. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనత ఈ దేశంలో ఎవరికైనా ఉందీ అంటే అది ఒక్క చంద్రబాబుకే. ఇప్పుడు ఆయన ఎన్నికలు వస్తున్నాయని దొంగ హామీలు ఇస్తూ బయలుదేరాడు. అది కూడా సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి. చంద్రబాబూ.. ఎన్నికలు వస్తున్నాయని హామీలిస్తున్నావు.. మీ మామ ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇస్తే ఏం చేశావు? దాన్ని రూ 5.25కి పెంచింది మీరు కాదా? మద్యపానం నిషేధిస్తామని ఎన్నికలకు వెళ్లి.. ముఖ్యమంత్రిగా కాగానే మద్యపానం నిషేధిస్తే రాష్ట్రమంతా అధోగతి పాలవుతుందని, ఖజానా దివాలా తీస్తుందని ఈనాడు పత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించుకుంది మీరు కాదా? ఆ తర్వాత గ్రామగ్రామానా బెల్టు షాపులు పెట్టించి మద్యం పారించింది మీరు కాదా? కరెంటు బిల్లులు వసూలు చేయడా ని ప్రత్యేక పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు పెట్టించింది మీరు కాదా? రైతుల మీద అఘాయిత్యాలు చేయించారు. ఆ అఘాయిత్యాలను భరించలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవహేళన చేసి మాట్లాడింది మీరు, మీ పార్టీ కాదా? ఉచిత కరెంటు ఇస్తే తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని వెటకారం చేయలేదా? వ్యవసాయ విద్యుత్ హార్స్ పవర్‌కు రూ.50 ఉన్న దాన్ని రూ.625కు పెంచింది మీరు కాదా? విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఒక్క రూపాయి ఇస్తాన న్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే జగన్మోహన్రెడ్డి రూ.50 ఇస్తానని చెప్పినా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. కారణం చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించినప్పుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసి కనీసం 10 పైసలు కూడా ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబుకు లేనిది, జగన్మోహన్రెడ్డి ఉన్నది ఏమిటీ అంటే అది విశ్వసనీయత అని గట్టిగా చెప్పగలను’’. యాత్ర సాగిందిలా.. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి గౌనిపల్లె మీదుగా రాష్ట్ర సరిహద్దులోని ఠాణా గ్రామానికి చేరుకున్న జగన్‌కు ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. కర్ణాటకలోని పలు గ్రామాల్లో జనం రహదారుల పైకి వేచి ఉండడంతో యాత్ర ఆలస్యమైంది. ఉదయం పది గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట చేరుకోవాల్సిన ఆయన మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు వచ్చారు. తొలుత శంకరాపురంలో సుబహాన్ సాహెబ్ కుటుంబాన్ని ఓదార్చి, ఆ గ్రామ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం బి.కొత్తకోటలో ప్రసంగించారు. తర్వాత నాయనబావి, ఉలవలవారిపల్లె, గట్టులో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సాయంత్రం అంగళ్లులో జరిగిన సభలో మాట్లాడారు. తర్వాత కురబలకోటకు చేరుకుని రోడ్ షో నిర్వహించారు. తిరిగి అంగళ్లుకు చేరుకుని స్థానిక నేత రమణారెడ్డి ఇంట్లో బసచేశారు. జగన్ వెంట పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. జైల్లో ఉండీ పోరాడాను.. ‘‘జగన్ జైల్లో ఉండి కూడా... రాష్ట్రాన్ని విడగొడుతున్న కాంగ్రెస్ పెద్దలతో పోరాటం చేశాడు. కానీ ఈ చంద్రబాబు బయటే ఉండి కూడా కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే కుమ్మక్కు రాజకీయాల గురించి మాట్లాడుతూ దిక్కుమాలిన అబద్ధాలు చెప్తున్నారు. ఎమ్మార్ అనే సంస్థకు హైదరాబాద్ నడిబొడ్డున పప్పుబెల్లాల మాదిరి చంద్రబాబు ఏకంగా 530 ఎకరాలు కేటాయించినా అది సీబీఐకి కనిపించదు. ఐఎంజీ భారత అనే సంస్థకు హైదరాబాద్‌లో ఎకరా కాదు, రెండు ఎకరాలు కాదు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఏకంగా 830 ఎకరాల భూమిని కట్టబెట్టినా సీబీఐకి కనిపించదు. దీనిపై విచారణ చేయమని హైకోర్టు అడిగినా ఇదే సీబీఐ ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వదు. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి? ఎవరిని తప్పించాలి. రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలి? ఎలా విడగొడితే ఎన్ని ఓట్లు వస్తాయనే దిక్కుమాలిన ఆలోచనతో కనిపిస్తున్నాయి. ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతున్న సోనియాకు, ఈ చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్తున్నా.. మీరు చేస్తున్న మోసం ఊరికే పోదు, పై నుంచి దేవుడు అనే వాడు చూస్తున్నాడు. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మనందరం ఒక్కటవుదాం. 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఆ కోటను మనమే పునఃనిర్మిద్దాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, ప్రతీ ప్రాజెక్టుకు కూడా నీళ్లు తెచ్చుకుందాం.’’ -
తంబాళపల్లి నుండి సమైక్య శంఖారావం
-
'పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా'
-
పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా: వైఎస్ జగన్
చిత్తూరు: కొడుకు కోసం తెలుగువారి జీవితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని వదిలివెళ్లాలట, మరి సోనియా గాంధీ ఎక్కడకు వెళ్లాలో చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు చెప్పాలని వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వైఎస్ జగన్ మంగళవారం చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిల వైఖరిపై మండిపడ్డారు. వైఎస్ హయాంలో ప్రజలు సువర్ణయుగాన్ని చూశారని చెప్పారు. వైఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా రాలేదని జగన్ గుర్తుచేశారు. అందరూ రండి ఎన్నికలకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నేను సమైక్యవాదంతో ఎన్నికల్లోకి వస్తానని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచిన ఆయన ఇప్పుడు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారని జగన్ విమర్శించారు. మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలుచేస్తే ఎత్తేసింది చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే రూ. 5 పెంచింది చంద్రబాబు కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అప్పులు పాలైన రైతన్న ఆత్మహత్య చేసుకుంటే తిన్నది ఆరగక చనిపోతున్నారన్నది చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు 16లక్షలు మాత్రమేనని, కానీ పింఛన్లను 16నుంచి 78 లక్షలకు పెంచిన ఘనత వైఎస్సార్‌దేనని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు రూ. 70పింఛన్ ఇస్తే వైఎస్సార్ రూ. 200కు పెంచారని చెప్పారు. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొస్తానని, ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నేను చనిపోయినా.. పేదల ఇళ్లల్లో నా ఫోటో, మానాన్న ఫోటో ఉండేలా పరిపాలిస్తానని వైఎస్ జగన్ ఘాటుగా జవాబులిచ్చారు. -
బాబు కుమ్ముక్కుతోనే విభజన
‘సమైక్య శంఖారావం’లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం ‘‘చంద్రబాబు.. అవినీతి గురించి మాట్లాడతారు. అయ్యా 1978లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీ కుటుంబం ఆస్తి మొత్తం రెండున్నర ఎకరాలకు మించి లేదన్న సంగతి మర్చిపోయారా? ఇవాళ చంద్రబాబు ఆస్తి ఎలా ఉందీ అంటే.. మన రాష్ట్రంలోనే కాదు, పక్కన కర్ణాటక, తమిళనాడు చెన్నైలో ఎక్కడ చూసినా.. హెరిటేజ్ షాపులు వేలసంఖ్యలో కనిపిస్తాయి. మరి ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ? చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడ్డమంటే.. ‘టైజం నాకు పట్టదు’ అని బిన్‌లాడెన్ మాట్లాడినట్టు ఉంటుంది. ‘నా అల్లుడు అంత అవినీతి పరుడు దేశంలోనే మరొకడు లేడు’ అని ఆయన సొంత మామ ఎన్టీఆర్ స్వయంగా లేఖలో రాశారు. ఇదే చంద్రబాబు గురించి కమ్యూనిస్టులు.. ‘చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా’ అనే పుస్తకమే ముద్రించారు.’’ - వైఎస్ జగన్ ‘‘చంద్రబాబు అబద్ధాలు చెప్తారు.. మోసం చేస్తారు.. సీబీఐ కేసులంటారు.. జగన్‌ను ఎందుకు జైల్లో నుంచి తీసుకొచ్చారు అంటారు. జగన్మోహన్రెడ్డి ఒక్కరే కాదయ్యా.. ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తిని జైల్లో పెడితే.. ఎంక్వైరీ పూర్తి కాకుండా, ఆ వ్యక్తి అన్యాయం చేశాడని నేరం రుజువు కాకుండా.. ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో సంవత్సరాలపాటు పెట్టడం ఎంతవరకు న్యాయం? అని చంద్రబాబును అడగదలచుకున్నా. అయ్యా నువ్వు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కుమ్మక్కై నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. ఏదో ఒక రోజు దేవుడు పై నుంచి కరుణిస్తాడు. దేవుడు నీ విషయంలో కూడా ఇదే చేస్తాడు. నన్ను 16 నెలలు పెట్టారు... నిన్ను కనీసం రెండు మూడు నెలలు పెడితే నీకెలా ఉంటుందో ఆ రోజు నిన్ను అడుగుతా చంద్రబాబూ!’’ సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని కాపాడడం వరకు నాలుగేళ్లుగా అడుగడుగునా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘‘ఇవాళ రాష్ట్రాన్ని విడగొడుతున్నది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆ సోనియా గాంధీతో కుమ్మక్కై ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పడంలేదా?’’ అని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే.. తిరుపతిలో గంటకుపైగా మీటింగ్ పెట్టి మాట్లాడిన చంద్రబాబు.. ఒక్కసారి కూడా సమైక్యం అన్న మాటే అనలేదని దుయ్యబట్టారు. ‘‘మొన్నటికి మొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ.32 వేల కోట్ల మేర చార్జీలు పెంచి కరెంటు బిల్లులతో ప్రజలకు షాక్ కొట్టిస్తోంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లంతా కూడా ఒక్కటై అవిశ్వాసం తీర్మానం పెడితే.. ఆ సమయంలో ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌జారీ చేసిన మాట వాస్తవం కాదా? అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఆ వేళ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ సర్కారే కూలిపోయి ఉండేది.. విభజన జరక్కుండాపోయేది’’ అని జగన్మోహన్రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర రెండో దశ రెండో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగింది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ‘‘మొన్నటికిమొన్న చంద్రబాబు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి సుదీర్ఘంగా గంటకుపైగా మాట్లాడారు. చంద్రబాబు గర్జిస్తున్నారు.. ప్రజా గర్జన అని పేరు పెట్టి పిలుస్తున్నారు.. ఆ గర్జనలో చంద్రబాబు సమైక్య నినాదం తీసుకుంటారేమోనని నేను ఆశగా ఎదురుచూశాను. మన ఖర్మ ఏంటంటే.. చంద్రబాబు నాయుడు మారనే మారరు. గంటపాటు సాగిన మీటింగ్‌లో కనీసం ముప్పావు గంట జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే కేటాయించారు. రాష్ట్రం మొత్తం సమైక్య ఉద్యమంతో ఉడుకుతూ ఉంది. సమైక్య నినాదం తీసుకోమని చంద్రబాబును ప్రతి రైతన్న కాలర్‌పట్టుకుని అడగబోతున్నాడు. ఉద్యోగం కోసం మేం ఎక్కడికి వెళ్లాలి అని ప్రతి విద్యార్థీ చంద్రబాబును కాలర్‌పట్టి నిలదీసే పరిస్థితి ఉంది. అయినాసరే చంద్రబాబు నాయుడి నోట స..మై..క్యం.. అన్న మాట రానేరాదు. ఎవరు చంద్రబాబూ కుమ్మక్కైంది? జగన్మోహన్రెడ్డి సోనియా గాంధీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు అంటున్నారు. ఎవరు ఎవరితోనయ్యా కుమ్మక్కైంది? ఆయన్ను నేను ఓ మాట అడగదలచుకున్నా.. జగన్మోహన్రెడ్డిని ఎవరయ్యా జైల్లో పెట్టించారు? జగన్మోహన్రెడ్డి మీద ఎవరయ్యా కేసులు పెట్టారు? ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన 18 నెలల తర్వాత, ఆ దివంగత నేత కొడుకైన జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి రెండు నెలలైన తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, చంద్రబాబు కుమ్మక్కై కోర్టులకు పోవడం నిజం కాదా అని అడుగుతున్నా. ఇద్దరూ కలిసి ఆ దివంగత నేత మీద కేసులు వేశారు.. ఆ దివంగత నేత చెప్పుకోలేడని, ఆయనకు ఎవ్వరూ తోడుగా రారని, ఆయనను బజారుకు ఈడ్చాలని ఇద్దరూ కలసికట్టుగా ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఇద్దరూ చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్సిగ్గుగా కలసికట్టుగా పోటీచేశారు. చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు.. హైదరాబాద్‌లో నడిబొడ్డున అమీర్‌పేటలో రూ.400 కోట్ల విలువ చేసే తొమ్మిది ఎకరాల భూమిని జీఎం నాయుడు అనే వ్యక్తికి ధారాదత్తం చేశారు. ఆర్టీఐ కమిషనర్ల పదవులనూ ఇద్దరూ కలిసికట్టుగా పంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు చిన్న వర్తకులు, రైతులపై ప్రభావం చూపే ఎఫ్‌డీఐల మీద ఓటింగ్ సమయంలో.. దేశం మొత్తం చూస్తుండగా.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించారు.. ఇది కుమ్మక్కు కాదా చంద్రబాబూ? ఆ హామీల సంగతేంటి బాబూ? చంద్రబాబు నాయుడిని ఒక మాట అడగదలచుకున్నా.. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హామీలిస్తున్నావ్ బాబూ.. మీ మామ ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే.. దాన్ని రూ.5.25 చేసింది నువ్వు కాదా? నాడు పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇస్తూ ఎన్నికలకు వెళ్లావ్... ఎన్నికలైపోయిన తర్వాత ‘ఈనాడు’ దినపత్రికలో.. మద్యపానం నిషేధిస్తే.. రాష్ట్రమంతా అధోగతి పాలవుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధించకపోగా.. ఊరుఊరునా బెల్టు షాపులు తెచ్చింది నువ్వు కాదా చంద్రబాబూ? ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తామంటున్న చంద్రబాబూ.. ఆ రోజు.. రూ.50గా ఉన్న హార్స్ పవర్ విద్యుత్ ను రూ.625కు పెంచింది నువ్వు కాదా? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. రైతన్నకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండీ అని ప్రతిపక్షాలంతా ధర్నాలు చేస్తూ ఉంటే.. కరెంటు తీగలు చూపించి.. ‘ఉచితంగా కరెంటు ఇస్తే.. ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికివస్తా’యంటూ కొట్టిపారేసింది నువ్వు కాదా చంద్రబాబూ? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే.. తిన్నది అరక్క వారు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మీ పార్టీ కాదా? అని అడుగుతున్నా. నువ్వా చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తన మీద సీబీఐ విచారణ జరగకుండా చూసుకున్నారు. శ్రీమంతులు గోల్ఫ్ ఆట ఆడుకోవడానికి, శ్రీమంతులు ఇళ్లు కట్టుకుని అమ్ముకోవడానికి చంద్రబాబు హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో విలువైన 530 ఎకరాలను ఎమ్మార్ అనే సంస్థకు అప్పనంగా కేటాయించేస్తే.. అది కూడా సింగిల్ టెండరుకు ఇచ్చి అన్ని ఉల్లంఘనలకూ పాల్పడితే.. సీబీఐ చంద్రబాబును కనీసం ఎంక్వైరీకి కూడా పిలవదు. ఇదే చంద్రబాబు ఐఎంజీ భారత అనే సంస్థకు.. హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 830 ఎకరాలను.. విలాసవంతమైన ఇళ్లు కట్టి శ్రీమంతులకు అమ్ముకోవడానికి ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ.. కేబినెట్‌కు కూడా పోకుండా ఒక డమ్మీ కంపెనీకి ఆయన భూములు అక్రమంగా కేటాయింపులు చేస్తే.. హైకోర్టు చంద్రబాబు మీద ఎంక్వైరీ చేయాలని ఆదేశాలిస్తే.. సీబీఐ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇవ్వకుండా చూడ్డానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఇటువంటి వ్యక్తా అవినీతి గురించి మాట్లాడేది? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ఉద్యమాలు జరుగుతూ ఉంటే.. చంద్రబాబు గంటలకు గంటలు మీటింగ్ పెట్టి.. అందులో సమైక్యం గురించి మాట్లాడకుండా.. సమైక్య ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా.. ఎన్నికల గురించి మాట్లాడ్డం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇవాళ చంద్రబాబుకు చెప్తున్నాను.. మోసం చేస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డికీ చెప్తున్నాను. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సోనియా గాంధీకి చెప్తున్నాను. మీరు చేస్తున్న మోసం ఊరికే పోదు. పై నుంచి దేవుడనేవాడు కచ్చితంగా చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలందరం కూడా ఒక్కటవుదాం. ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనంతట మనమే తెచ్చుకుందాం.. ఆ తర్వాత ఎవరు మన రాష్ట్రాన్ని ఎలా విడగొడతారో చూద్దాం. మన రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని గట్టిగా చెప్తున్నాను. కుయుక్తులు, కుమ్మక్కు రాజకీయాలతో చెడిపోయిన ఈ వ్యవస్థలో ఇవాళ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్యే’’. జగన్మోహన్రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో చిత్తూరు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్. అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు రోజా తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ మొదటి భేటీలోనే ఎస్టీ జాబితాలో చేరుస్తాం వాల్మీకులకు జగన్ హామీ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీకి తగ్గట్టుగానే తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చౌడేపల్లెలో సోమవారం ఉదయం తనను కలసిన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పొదల నరసింహులు నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. వాల్మీకుల డిమాండ్ సమంజసమైనదని, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా వాల్మీకులను ఎస్టీలుగా చేర్చాలన్న అంశాన్ని ఉంచామన్నారు. పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, నారాయణస్వామి నేతృత్వంలో వాల్మీకి సంఘం నేతలు బొగ్గిట కృష్ణమూర్తి, హరికృష్ణ ఆయనను కలిశారు. - సాక్షి ప్రతినిధి, తిరుపతి -
`జగన్ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు`
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు. ఈ శంఖారావం సభలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి, జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన పాపం కిరణ్, చంద్రబాబులదేనని వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని.. దేశవ్యాప్తంగా ఆలోచింప చేసిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని తెలిపారు. -
కదిలిన పల్లెలు
పలమనేరు నియోజకవర్గం వి.కోట నుంచి మూడో రోజు ప్రారంభమైన సమైక్య శంఖారావం యాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు. జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వెంట నడిచారు. మిద్దెల పైనుంచి మహిళలు పూలవర్షం కురిపించారు. జననేతను కలిసిన వృద్ధులు తమ బాధలు చెప్పుకున్నారు. రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. మహానేత తనయుడు కనిపించగానే కరచాలనం కోసం చేతులు చాచారు. జగన్మోహన్రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. సభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిభరోసా : నేనున్నా నీకేల భయంఅమ్మదీవెన: హారతులిచ్చి కుంకుమపెట్టి దీవిస్తున్న మహిళబెరైడ్డిపల్లెలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి మద్దతు పలుకుతున్న జనంమురిపెం : జగన్‌ను చూసి మురిసిపోతున్న చిన్నారిఅక్కయ్యా : భవిష్యత్ మనదే బెంగ వద్దుఎదురుచూపు : జగన్ కోసం మిద్దెలెక్కి నిరీక్షిస్తున్న అభిమానులుఆత్మీయ కరచాలనం కోసం : కరచాలనం కోసం అభిమానుల తహతహఈ కష్టాలు ఇంకెంతకాలం తండ్రీ.. : జగన్‌కు వృద్ధురాలి మొరదిగులొద్దు: వికలాంగుడికి జగన్ భరోసా, జననేతను చూసి నమస్కరిస్తున్న ఓ వికలాంగుడుపూలవాన: జగనన్నపై పూల వర్షం కురిపిస్తున్న యువతులుఆశీర్వాదం: చిన్నారిని ఆశీర్వదిస్తున్న జగన్అయ్యో.. ఎంతకష్టం : బీన్స రైతుల బాధలను ఆలకిస్తూ.. -
‘శంఖారావానికి’ మద్దతు ఇవ్వండి
బెలగాం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి చేపడుతున్న సమైక్య శంఖారావానికి నాయకులు, కార్యకర్తలు మద్దతు పలకాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రసన్నకుమార్, ఉదయభాను పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని రాజశేఖరరెడ్డి, తెలుగుతల్లి విగ్రహా లకు వారు పూలమాలలు వేసి,నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని స్పష్టం చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ శ్రీనివాసరావు, యువజన విభాగం కన్వీనర్ వెంకటేష్, మం డల కన్వీనర్ చుక్క లక్ష్ముంనాయుడు, పాల్గొన్నారు. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రైవేట్ భవనంలో పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ, ప్రతి వార్డుకూ పది నుంచి 15 మం దితో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్, చుక్క లక్ష్ముంనాయుడు, కేతిరెడ్డి రాఘవకుమార్, బాలమురళీకృష్ణ, రవికుమార్, షఫి , ఎస్వీఎస్ఎన్ రెడ్డి, పాల్గొన్నారు. -
సమైక్య శంఖారావానికి జన ప్రవాహం
-
రాజధానికి వేలాదిగా తరలిన సమైక్యవాదులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వర్ష బీభత్సం వారి ‘సమైక్యాంధ్ర’ ఆకాంక్షను నీరుగార్చలేకపోయింది. ఇళ్లు, పొలాలను ముంచెత్తిన వరద వారిని సమైక్యాంధ్ర ఉద్యమపథం నుంచి పక్కకు మళ్లించలేకపోయింది. అందుకే.. ప్రకృతి ప్రకోపాన్ని కూడా లెక్క చేయకుండా భావితరాల బాగు కోసం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సమష్టిగా హైదరాబాద్ వైపు కదం తొక్కారు. జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు భారీగా తరలివెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు వేలాదిగా హైదరాబాద్‌కు పయమయ్యారు. సమైక్యవాదులతో కిటకిటలాడుతూ ప్రత్యేక రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలు రాష్ట్ర రాజధాని బాట పట్టాయి. జిల్లా కేంద్రం నుంచి ఒంగోలు చిట్టచివరన ఉన్న యర్రగొండపాలెం వరకు ప్రతి చోటా ఇదే దృశ్యం కనిపించి సమైక్యాంధ్ర ఆకాంక్షను ప్రతిబింబించింది. ప్రత్యేక రైళ్ల కిటకిట వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్య శంఖారావం సభ కోసం జిల్లా నుంచి మూడు ప్రత్యేక రైళ్లు వేశారు. ఇలా జిల్లా నుంచి ఓ సభకు ప్రత్యేకంగా రైళ్లు వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన ప్రత్యేక రైలు ఒంగోలులో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరింది. వేలాదిగా చేరుకున్న పార్టీ శ్రేణులతో ఒంగోలు రైల్వే స్టేషన్ సందడిగా మారింది. అందరూ జై సమైక్యాంధ్ర.. జై జగన్ అని నినాదాలు చేస్తూ ప్రత్యేక రైల్లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. గిద్దలూరు సమన్వయకర్త ముత్తముల అశోక్‌రెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతూ ఆ రైలు హైదరాబాద్ బయలుదేరింది. చీరాల పార్టీ సమన్వయకర్త యడం చిన రోశయ్య అక్కడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు వేశారు. సమైక్యవాదలతో కిటకిటలాడుతూ రాజధానికి పయనమైంది. కిక్కిరిసిన వాహనాలు ఇక సమైక్య శంఖరావం సభకు జిల్లా నుంచి వందలాది బస్సులు, ఇతర వాహనాల్లో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. జిల్లా నుంచి దాదాపు 600 బస్సులు, దాదాపు వెయ్యి వరకు ఇతర వాహనాల్లో రాజధానికి వెళ్లడం విశేషం. ఒంగోలు నుంచి 100 బస్సులు, మరో 150 వాహనాల్లో బయలుదేరారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాత్రి 10 గంటలకు ఈ వాహనాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి 65 బస్సులు, 100కుపైగా వాహనాల్లో వెళ్లారు. అద్దంకి నుంచి 75 బస్సులు, 120 వాహనాల్లో బయలుదేరారు. పర్చూరు నుంచి 50 బస్సులు, 170 వరకు ఇతర వాహనాల్లో సమైక్యవాదులు రాజధానికి పయనమయ్యారు. కందుకూరు నుంచి 35 బస్సులు, దాదాపు 100 వాహనాల్లో వెళ్లారు. దర్శి నుంచి 45 బస్సులు, 100 వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. కనిగిరి నుంచి 38 బస్సులు, 120 వాహనాల్లో వెళ్లారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి 60 బస్సులు, 100 వాహనాల్లో పయనమయ్యారు. యర్రగొండపాలెం నుంచి 40 బస్సులు, 40 వాహనాల్లో వెళ్లారు. కొండపి నియోజకవర్గం నుంచి 20 బస్సులు, 60 వాహనాల్లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. చీరాల, గిద్దలూరుల నుంచి రైళ్లు కాకుండా అదనంగా మరో 120 వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా శనివారం తెల్లవారు జామున మరికొన్ని బస్సులు, ఇతర వాహనాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఇంత భారీ సంఖ్యలో జిల్లా నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో కిటకిటలాడుతూ రాజధాని బాటపట్టడంతో ఇదే తొలిసారి. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా సమైక్య శంఖారావం వాహనాలతో సందండి సందడిగా మారింది. జిల్లా సమైక్యాంధ్ర స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పింది. -
సమైక్య సమర సైనికులై..
సాక్షి, కాకినాడ: అందరి హృదయ స్పందనా సమైక్యతే! అందరి లక్ష్యమూ సమైక్యాంధ్ర పరిరక్షణే! అందుకే వైఎస్సార్ సీపీ సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి జనం వెల్లువలా కదలి వెళ్లారు. ఆది నుంచీ తమ ఆకాంక్షలకు ప్రతినిధిగా, ప్రతిధ్వనిగా నిలుస్తున్న జననేత జగన్‌పై నిండు నమ్మకంతో, ఆయన సారథ్యంలో జాతి ఐక్యతను నిలిపే సైనికుల్లా సమరోత్సాహంతో రాజధానికి బయల్దేరారు. రాష్ర్ట రాజధానిలో సమైక్యగళం వినిపిం చేందుకు ఉరకలెత్తారు. జిల్లాలోని అన్ని దారుల దిశా శుక్రవారం రాష్ట్ర రాజధానే అయింది. వేల సంఖ్యలో పార్టీనేతలు, శ్రేణులు, విద్యార్థులు, రైతులు, కూలీలు, సమైక్యవాదులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. సమైక్యాం ధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్యశంఖారావం సభే వారందరి గమ్యం. సెప్టెంబర్ ఏడున ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరిగాక 50 రోజుల తర్వాత ఈ సభ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుం ది. జైలు నుంచి బయటకొచ్చాక జగన్మోహన్రెడ్డి తొలిసారిగా సమైక్యాంధ్రపై బహిరంగ సభలో ప్ర సంగించనుండడంతో జననేతకు అండగా నిలిచి స మైక్యనాదం ఢిల్లీకి వినిపించాలన్న దృఢసంకల్పంతో సమైక్యవాదులు రాజధాని దారి పట్టారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీజీసీ సభ్యులు, పార్టీ కో ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్ల నాయకత్వంలో వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ, టూరిస్ట్ బస్సులన్నీ పార్టీ శ్రేణులతో నిండిపోయాయి. వీటితో పాటు ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సమకూర్చిన బస్సులు, కార్లు, ఇతర వాహనాలలో వేలాది మంది పయనమయ్యారు. సమైక్య శంఖారావం సభ కోసమే ప్రత్యేకంగా కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వే సిన రైలు పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బస్సులు సరిపోకపోవడంతో పలువురు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా సమైక్యవాదులు రాజధానికి కదంతొక్కారు. పాతిక వేలమందికి పైనే.. జిల్లా నుంచి పాతికవేల మందికి పైగా సమైక్య శంఖారావం సభకు బయల్దేరారని అంచనా. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ప్రత్యేక రైలును జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు జెండా ఊపి ప్రారంభించారు. వేణుతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజాల ఆధ్వర్యంలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు కాకినాడ సిటీ నుంచి బయల్దేరారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన వందలాది మంది సామర్లకోటలో ప్రత్యేక రైలు ఎక్కారు. జిల్లా జేఏసీ నేతలు ప్రత్యేక రైలుకు సమైక్యరాష్ట్ర నినాదంతో ఉన్న పోస్టర్లను అతికించారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పినిపే విశ్వరూప్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకట రమణచౌదరితో పాటు ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మితో సహా పార్టీ కో ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్ల ఆధ్వర్యంలో అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ని యోజకవర్గాల వారీగా సమకూర్చిన బస్సులు, ఇతర వాహనాల్లో పార్టీ శ్రేణులు బయల్దేరాయి. జిల్లా కన్వీనర్ కుడుపూడి, అమలాపురం కో ఆర్డినేటర్ చింతా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అమలాపురం నుంచి బయల్దేరారు. రంపచోడవరంలో కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, పరిశీలకుడు కర్రి పా పారాయుడుల ఆధ్వర్యంలో జిల్లా అధికారప్రతి నిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎస్టీ సెల్ కన్వీనర్ పల్లాల వెంకటరమణారెడ్డిలతో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. రాజమండ్రి నుంచి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బస్సులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పయనమయ్యారు. రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో వందలాది మంది బయల్దేరారు. రాజానగరం నుంచి సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నాయకులు జక్కంపూడి రాజా, గణేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ విభాగాల కన్వీనర్లు మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్‌రాజు తదితరులు పయనమయ్యారు. బొమ్మూరు నుంచి రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, అనపర్తిలో పార్టీ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మండపేటలో కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రా ధాకృష్ణ, రాజోలు నుంచి పార్టీ కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, వెంకట్రామరాజు, ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, భూపతిరాజు సుదర్శనబాబు, పెన్మత్స చిట్టిరాజు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బయలుదేరారు. పి.గన్నవరంలో పార్టీ కోఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్, కొండేటి చిట్టిబాబు పార్టీ శ్రేణులతో రాజధానికి బయల్దేరారు. -
సర్వేలను బట్టి బాబు పార్టీలు మారుస్తారు
-
సీఎం ఇంటి ముట్టడికి YSR కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిలుపు
-
సమైక్యశంఖారావానికి మద్దతు పలికిన ఎస్వీయూజాక్
-
పోలీసుల నిర్ణయాన్ని తోసిపుచ్చిన హైకోర్టు
-
28న సమైక్యశంఖారావం
* సభకు అనుమతి కోరుతూ పోలీసులకు వైఎస్సార్సీపీ దరఖాస్తు సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభను అక్టోబర్ 28న నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో మొదట ఈ నెల 19నే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలనుకున్నా.. ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 19వ తేదీ మరో రెండు రోజులే ఉండటంతో సమైక్య శంఖారావం సభను ఈ నెల 28వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పు సంతోషకరం సమైక్య శంఖారావం సభకు హైకోర్టు అనుమతినివ్వడాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్వాగతించారు. న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. హింసించి ఆనందించే స్వభావం ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసులు వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని మైసూరా వ్యాఖ్యానించారు. తాము తలపెట్టిన సభ ఎవరి మనోభావాలను గాయపరచడానికో లేదా ప్రజల మధ్య విద్వేషాలను రగల్చడానికో కాదని ఆయన స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతాయనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే తమ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. సమైక్యంగా ఉండటం మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా క్షేమమని చెప్పారు. -
సమైఖ్యశంఖారావం జరిగి తీరుతుంది: భూమన
తిరుపతి: రాష్ట్ర రాజధానిలో హైదరాబాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న జరప తలపెట్టిన సమైఖ్యశంఖారావం సభ జరిగి తీరుతుందని తిరుపతి ఎమ్మెల్యె భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా న్యాయస్థానాల మీద తమ పార్టీకి అపారగౌరవం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ ఏజెంట్ లా పని చేస్తూ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు అయ్యారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన దీక్షలకు కరుణాకర్ రెడ్డి నేడు సంఘీబావం ప్రకటించారు. హైదరాబాదులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమైఖ్యశంఖారావం సభ నబూతో న భవిష్యత్ తరహాలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'సమైఖ్య శంఖారావం'... సమైక్యాంధ్ర ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని భూమన అన్నారు. -
వైఎస్ఆర్ సీపీ సభకు అనుమతి ఇవ్వాలి: రాఘవులు
హైదరాబాద్ : ఈనెల 19న హైదరాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని గుర్తు చేశారు. గతంలో సమైక్యవాదుల సభలకు, తెలంగాణవాదుల సభలకు అనుమతిచ్చారు కదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ సమైక్య సభకు అనుమతిపై పోలీసులు నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని రాఘవులు సూచించారు. ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరకీ లేదన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న తమకు మద్దతు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు సీపీఎం నేతలను కోరారు. తాము మొదట్నించీ సమైక్యవాదులమేనని, తమ పూర్తి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులకు హామీ ఇచ్చారు. -
అన్యాయం..అనైతికం
సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు రాజకీయపరంగా నిర్ణయం తీసుకుంటే అది తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభను నిర్వహించాలని నిర్ణయించిన విషయం, దానికి పోలీసులు అనుమతి నిరాకరించడం తెలిసిందే. ఆదివారం మైసూరారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సభ్యుడు కె.శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు డీసీపీ ఇచ్చిన ఆర్డర్‌ను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘తమకు నచ్చిన వారు సభలు పెట్టుకుంటే వారికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తారు. తమకు నచ్చని వారు సభలు నిర్వహించాలనుకుంటే మాత్రం పోలీసులకు శాంతిభద్రతలు గుర్తొస్తాయి. పోలీసులంటే అధికార పార్టీకి ‘ఎస్ బాస్’ లే కదా. వారు ఏం చెబితే దానికి వంతపాడటం పోలీసులకు రివాజుగా మారింది. ఇప్పుడు డీసీపీ ఆదేశాలు కూడా అందులో భాగమే’ అని మైసూరా మండిపడ్డారు. సీడబ్ల్యూసీ తీర్మానం గురించి పోలీసు ఆర్డర్లో పేర్కొన్నారని, అసలు దానికీ పోలీసులకూ ఏం సంబంధమని ఆయన సూటిగా ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అనేది కాంగ్రెస్ కమిటీ అని, కాంగ్రెసేం పోలీసులకు బాస్ కాదు కదా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం కూడా ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. అది చట్ట సభకు వచ్చి ఆమోదం పొందిన తరువాత దానిని అమలు చేయాలి. అంతేకానీ ఇప్పుడే అధికార పార్టీ వైఖరిని పేర్కొంటూ వ్యవహారాలను నడపడం పోలీసుల బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. అధికార పార్టీకి కొమ్ము కాశారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మైసూరారెడ్డి ప్రశ్నించారు. భావ ప్రకటన హక్కును కాదంటారా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉందనీ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాదే ఉందనీ, ఈ రాజధానిలో వివిధ పార్టీలు, వ్యక్తులు తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో సమైక్యం, విభజన కోరుకునే వారిద్దరూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుంది. వినడానికి వచ్చే వారిని విచ్ఛిన్నకర శక్తులనడం చూస్తే పోలీసులే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఉంది. ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు లేవు. భావాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఆ భావాలను చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ, వారి భావాలను చెప్పుకోవడానికి వస్తున్న వారిని విధ్వంసకారులని అనడం తప్పు. సమైక్యవాదాన్ని కోరుకుంటున్న ముఖ్యమంత్రికి ఇది తగునా?’ అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రాజకీయ వైఖరిని మార్చుకుందనడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ స్టాండ్ అపుడూ ఇపుడూ ఎల్లప్పుడూ ఒకటేనని అయన స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించే అధికారం, కలిపి ఉంచే అధికారం కేంద్రానికి ఉందని మేం గుర్తు చేస్తే... కొందరు దానిని పట్టుకుని తమ స్థాయికి దిగజారి మాట్లాడ్డం ఏమాత్రం సరికాదు. ఇది అన్యాయం’ అన్నారు. ఇది కేవలం తమ పార్టీపై బురద జల్లడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే అవుతుందన్నారు. ఎవరికీ అన్యాయం జరక్కుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని కోరితే మీ ఇష్ట ప్రకారం చేయమని అర్థమా? అని ఆయన ప్రశ్నించారు. తాము అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పామో పూర్తిగా చదవమని దిగ్విజయ్, షిండేలకు ఆయన సూచించారు. ‘మీకు ఇంగిత జ్ఞానం లేదు, మీ కింద ఉండే పోలీసులకు మోకాళ్లలో మెదడుంది. మా స్టాండ్ ఏమిటో తెలుసుకోకుండా కళ్లు మూసుకుని ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుందా’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన అందరికీ నష్టమే... కలిసుంటే బలంగా ఉంటాం విభజన వల్ల ఇరుప్రాంతాల ప్రజలూ నష్టపోతారనేది వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి అని మైసూరారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. ఐకమత్యంగా ఉంటేనే జాతీయ స్థాయిలో బలంగా ఉండగలమనేది తమ పార్టీ అభిప్రాయమని ఆయన అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు ప్రాంతాల ప్రజల అభివృద్ధిని ఆశించి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారని, దానివల్ల అందరూ లబ్ధి పొందారని ఆయన గుర్తుచేశారు. అందువల్లనే తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక సమైక్యవాదం బలంగా వినిపించేందుకు హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకున్నామని, అంతే తప్ప ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశంతోనో, విద్వేషాలు రెచ్చగొట్టడానికో కాదని మైసూరా అన్నారు. వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఇక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేస్తూ.. అలాంటి పార్టీ తలపెట్టిన సభకు రక్షణ కల్పించాల్సింది పోయి నిరాకరించడం అనైతికం అని వ్యాఖ్యానించారు. ‘తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాదా..! లేక సోనియా తలపెట్టిన విభజన ఎజెండాను అమలు చేయడానికి ఆమె ఏజెంటుగా పని చేస్తున్నారా...?’ అని మైసూరా ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిని ఇచ్చారు, ఆ తరువాత సకల జనుల సభకూ అవకాశం ఇచ్చారు. ఇపుడు ప్రజల్లోకి వచ్చి సమైక్యవాదం గురించి మేం చెబుతామంటే ఎందుకు అనుమతిని ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘బహుశా అశోక్‌బాబు వారికి నచ్చినవాడు కనుక ఆయన సభకు పూర్తి రక్షణ కల్పించినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. సభ విజయవంతం అయితే అధికారపార్టీ నామరూపాల్లేకుండా పోతుందనే భయంతోనే అనుమతిని ఇవ్వలేదని మైసూరా విమర్శించారు. యూటర్న్ కాంగ్రెస్‌దే! తమను వైఖరి మార్చుకున్నారని చెబుతున్న దిగ్విజయ్‌సింగ్, సుశీల్‌కుమార్ షిండేలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మైసూరా హెచ్చరించారు. ‘మమ్మల్ని యూటర్న్ తీసుకున్నామని వీళ్లంటున్నారు, వాస్తవానికి యూటర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఆ విషయం వీళ్లిద్దరికీ తెలియదా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ప్రణబ్‌ముఖర్జీ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల పునర్విభజనకు మరో కమిటీని(రెండో ఎస్సార్సీ) వేయాలని 2001, అక్టోబర్ 30వ తేదీన సీడబ్ల్యూసీ చేసిన తీర్మానంలో పేర్కొన్నారు. 2004 ఎన్నికల ప్రణాళికలోనూ విదర్భ, తెలంగాణ వంటి చోట్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయని వాటి కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు’ అని ఆయన కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్తో చేసుకున్న అవగాహనలో కూడా రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలనే ఉందన్నారు. అది నాటి సీఎల్పీ నేత వైఎస్‌కు ఇష్టంలేకపోయినా గులాంనబీ ఆజాద్ వైఎస్‌ను ఒప్పించారని మైసూరా వెల్లడించారు. ఆ అవగాహనపై అప్పటి టీఆర్ఎస్ నేత నరేంద్ర సంతకం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి తాను చెప్పినవన్నీ కాంగ్రెస్ వెబ్సైట్లో ఉన్నాయని దిగ్విజయ్ వాటిని చూడవచ్చని వాటి ప్రతులను ఆయన పత్రికలకు విడుదల చేశారు. -
అది సీఎం కుట్రే : వైఎస్ఆర్సిపి లీగల్‌సెల్ కన్వీనర్
అనంతపురం: వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతివ్వకపోవడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రేనని ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి ఆరోపించారు. సమైక్యాంధ్రకు కట్టుబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. జగన్ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోసం పోరాటాలు ఉధృతంగా సాగుతాయని ఆయన చెప్పారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
జగన్ 'సమైక్య శంఖారావం' మైలురాయిగా నిలుస్తుంది
హైదరాబాద్ : ఈనెల 19న హైదరాబాదులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన 'సమైఖ్య శంఖారావం'... సమైక్యాంధ్ర ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం ఉద్యమకారులకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భూమన గురువారం తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోవడం వల్ల సీమాంద్రలో నిరుద్యోగం తాండవిస్తుందని... విద్యావంతులకు ఉద్యోగాలు దొరకవని ఆయన అన్నారు. నిరసనలో బాగంగా కరుణాకర్ రెడ్డి జనరేటర్లను తయారు చేశారు. విద్యావంతులంతా ఇతర చేతి పనులు చేసుకోవాల్సి వస్తుందని కరుణాకర్ రెడ్డి అన్నారు. -
డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు
ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించదలచిన సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డీజీపీ ప్రసాద్ రావును కోరారు. శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ సీపీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, గట్టు రామచంద్రరావు తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. స్థానిక డీసీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని డీజీపీ చెప్పినట్టు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ శాంతియుత పంథాలోనే పయనిస్తోందని గట్టు రామచంద్రరావు అన్నారు. గత మూడేళ్లుగా ఎక్కడ పర్యటించినా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని జూపూడి చెప్పారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు డీజీపీని కలసి సభకు అనుమతి ఇవ్వరాదని కోరారు. -
19న హైదరాబాద్‌లో జగన్ సమైక్యశంఖారావం
సమైక్యాంధ్రను కోరుకుంటూ మొదటి నుంచీ అనేక పద్ధతుల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ నెల 2 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఈ పార్టీ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే సమైక్యశంఖారావం ద్వారా సమైక్యరాష్ట్రం ఆకాంక్షను బలంగా వినిపించనున్నది. విభజన, సమైక్యవాదులందరూ సహకరించి తమ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ అధోగతేనంటూ ప్రజలు ఎదుర్కొనే విభజన సమస్యలను పార్టీ పదే పదే కేంద్రానికి వివరిస్తోంది. ఇదే అంశంపై హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం పేరిట భారీ సమావేశం నిర్వహించనున్నట్లు నిన్న జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అయినందున ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విభజనవాదులు, సమైక్యవాదులు సహకరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో, జైలు నుంచే జగన్ నిరాహారదీక్షలు చేసి తీవ్రస్థాయిలో తమ నిరసనను తెలిపారు. సమైక్య స్ఫూర్తిని చాటుతూ షర్మిల బస్సుయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, విభజనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఉధృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. -
నేటితో ముగియనున్న సమైక్య శంఖారావం
-
సమైక్య శంఖారావం 16th September 2013
-
సమైక్య శంఖారావం 14th September 2013
-
సమైక్య శంఖారావం 12th September 2013
-
సమైక్య శంఖారావం 7th September 2013
-
కాసేపట్లో నంద్యాలలో సమైక్య శంఖారావం సభ
-
సమైక్య శంఖారావం 6th September 2013
-
సమైక్య శంఖారావం 5th September 2013
-
సమైక్య శంఖారావం 4th September 2013
-
సమైక్య శంఖారావం 3rd September 2013
-
అశ్రు నయనాలతో వైఎస్‌కు కుటుంబ సభ్యుల నివాళి
-
షర్మిల శంఖారావం విజయవంతం అవ్వాలని అభిలాష
-
షర్మిల శంఖారావానికి వెల్లువెతున్న మద్దతు
-
షర్మిళ రావడం మా అదృష్టం - తిరుపతి వాసులు