రాష్ట్ర విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆయన సోమవారం నీరుగట్టువారిపల్లెలో ప్రసంగించారు. విభజిస్తే రెండు రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.