
జగన్ 'సమైక్య శంఖారావం' మైలురాయిగా నిలుస్తుంది
హైదరాబాద్ : ఈనెల 19న హైదరాబాదులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన 'సమైఖ్య శంఖారావం'... సమైక్యాంధ్ర ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం ఉద్యమకారులకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భూమన గురువారం తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోవడం వల్ల సీమాంద్రలో నిరుద్యోగం తాండవిస్తుందని... విద్యావంతులకు ఉద్యోగాలు దొరకవని ఆయన అన్నారు. నిరసనలో బాగంగా కరుణాకర్ రెడ్డి జనరేటర్లను తయారు చేశారు. విద్యావంతులంతా ఇతర చేతి పనులు చేసుకోవాల్సి వస్తుందని కరుణాకర్ రెడ్డి అన్నారు.