విభజన కుట్రలిక సాగవు: వైఎస్ జగన్ | No more conspiracies on bifurcation, says ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

విభజన కుట్రలిక సాగవు: వైఎస్ జగన్

Published Tue, Jan 28 2014 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

No more conspiracies on bifurcation, says ys Jagan mohan reddy

* వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవుతుంది..
* పెను ఉప్పెన సృష్టిస్తుంది..
* అందులో కుట్రదారులంతా కొట్టుకుపోతారు: జగన్

 

‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘దివంగత నేత బతికి ఉన్నంతవరకూ ఈ రాష్ట్రంవైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ రాలేదు. ఆయన మన నుంచి దూరమయ్యాక ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కచెక్కలు చేసే కుట్రకు తెరలేచింది. ఈ కుట్రలు ఎంతోకాలం సాగవు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె ఒక్కటవుతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పెను ఉప్పెన సృష్టిస్తుంది. ఆ ఉప్పెనలో విభజన కుట్రదారులు కొట్టుకుపోవడం ఖాయం’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యూత్ర’ నాలుగో విడత 8వరోజు సోవువారం సత్యవేడు నియోజకవర్గంలో సాగింది. వరదయ్యుపాళెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం జగన్ మాటల్లోనే..

 నమ్ముకున్న జనాన్నే అమ్మేస్తారు
 ‘‘మహానేత దూరమయ్యాక రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లో విశ్వసనీయుత అన్న పదానికి అర్థం కూడా తెలియని వారు అటు అధికార పక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ ఉన్నారు. నమ్మమకున్న జనాన్నే సీట్లు, ఓట్ల కోసం అమ్మేసేందుకు కూడా వెనుకాడని ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే బాధనిపిస్తోంది.’’
 - వైఎస్ జగన్
 
రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని 44 రోజులుగా చర్చ
 ‘‘రాష్ట్ర అసెంబ్లీలో 44 రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ చర్చ పేదవారి సమస్యలపై కాదు. ఈ రాష్ట్రాన్ని ఎలా వుుక్కలు చేయూలా అన్న అంశంపై నడుస్తోంది. గ్యాస్ డీలర్ దగ్గరకు వెళితే బ్యాంకుకు వెళ్లవుంటున్నాడు. బ్యాంకు వారేమో గ్యాస్ డీలర్ వద్దకే తిరిగి పంపుతున్నారు. చివరకేమో రూ.1,500 పెడితే కానీ గ్యాస్ సిలెండర్ అందడంలేదని అక్కా చెల్లెళ్లు వాపోతున్నారు. ఈ సవుస్యపై అసెంబ్లీలో చర్చ లేదు. కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. బిల్లు ఎంత ఉందో మళ్లీ అంత మొత్తాన్ని సర్ చార్జీల పేరుతో బాదుతున్నారు.
 
 ఈ సవుస్యపై అసెంబ్లీలో చర్చ లేదు. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 జబ్బులను తీసేశారు. చిన్న పిల్లల వుూగ, చెవుడు చికిత్సకు అవసరమయ్యే ‘కాక్లియుర్ ఇంప్లాంట్’ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ నుంచి తీసేశారు. ఈ ఆపరేషన్ చేరుుంచకపోతే ఆ పిల్లవాడు జీవితాంతం మూగవాడిగానే మిగిలిపోతాడు. ఇటువంటి జబ్బులను ఆరోగ్యశ్రీనుంచి తీసేస్తే దీనిపైనా అసెంబ్లీలో చర్చలేదు. విద్యాసంవత్సరం అరుుపోవస్తున్నా ఇప్పటివరకూ ఫీజు బకారుుల చెల్లింపు జరగలేదు. దీనిపైనా చర్చ లేదు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశంపైనా చర్చ జరగడం లేదు. 44 రోజులుగా ఈ రాష్ట్రాన్ని ఎలా విభజించాలి అన్న అంశంపై వూత్రమే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితి చూస్తోంటే.. ఇది అసెంబ్లీయేనా.. అనిపిస్తోంది. కానీ ఇప్పుడు సీట్లు, ఓట్ల కోసం ప్రజలను అమ్మేసేందుకు కూడా వెనకాడని ఈ రాజకీయు నాయుకులను చూస్తోంటే బాధనిపిస్తోంది.
 
 పై నుంచి దేవుడు చూస్తున్నాడు..
 దివంగత ప్రియుతవు నేత వైఎస్ ఆనాడు ఎర్రటి ఎండలో 1,500 కిలోమీటర్ల పాదయూత్ర చేసి పేదవాడి గుండె చప్పుడును అతి దగ్గర నుంచి విన్నారు. తాను వురణించాక కూడా పేదవాడి హృదయుంలో సజీవంగా ఉండాలని అనుక్షణం తపన పడ్డారు. ఆయన మన నుంచి దూరమయ్యాక ప్రజల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అసెంబ్లీలో చంద్రబాబు ఒక చేత్తో సైగచేసి సమైక్యాంధ్ర అనిపిస్తారు. అదే సమయంలో మరో చేత్తో సైగచేసి తన పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్ర విభజన డివూండ్ చేరుుస్తారు.
 
 ఇక మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గీసిన గీత దాటకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం పదవిలో ఉండేందుకు సమైక్య వుుసుగులో మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను అమ్మేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతోంది. వీరు చేసే కుట్రలు, మోసాలను పై నుంచి దేవుడు చూస్తూనే ఉన్నాడు. త్వరలో ఎన్నికలు వస్తారుు. వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై ప్రభంజనం సృష్టిస్తుంది. ఆ ప్రభంజనంలో విభజన కుట్రదారులు సోనియా, కిరణ్, చంద్రబాబు బంగాళాఖాతంలో కలసిపోతారు.’’
 
 ఎనిమిదోరోజు యూత్ర సాగిందిలా..
 సోమవారం ఉదయుం పది గంటల సవుయుంలో సత్యవేడు నియోజకవర్గంలోని రాజుల కండ్రిగ నుంచి జగన్ బయులు దేరి ఎస్.ఎస్.పురం చేరుకున్నారు. గ్రావుంలో, వైఎస్ మృతిని జీర్ణించుకోలేక గుండెపోటుతో వురణించిన దళిత వుహిళ బాలపల్లి సుబ్బవ్ము కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం జనికాపురం క్రాస్, కడివేడు గ్రామాల మీదుగా బీరకుప్పం చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత టీపీ పాళెం, రాజగోపాలపురం, తొండంబట్టు, పెద్దపాండూరు, వరదయ్యుపాళెంలలో దివంగత నేత విగ్రహాలను ఆవిష్కరించారు. వరదయ్యపాళెం బహిరంగ సభలో ప్రసంగించారు.
 
 అనంతరం బుచ్చినాయిన కండ్రిగ మండలం నీర్పాకోట గ్రామానికి చేరుకుని మండల వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ విద్యానంద రెడ్డి ఇంటిలో రాత్రి బస చేశారు. ఎనిమిదో రోజు యాత్రలో జగన్‌తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ కె.నారాయణ స్వామి, వూజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయుకర్త ఆదిమూలం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement