అశ్రు నయనాలతో వైఎస్కు కుటుంబ సభ్యుల నివాళి | Family members pay tearful tributes to YS Rajasekhara Reddy in Idupulapaya | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 2 2013 3:48 PM | Last Updated on Wed, Mar 20 2024 3:58 PM

దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ నాలుగో వర్ధంతిని ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అశ్రు నయనాల మధ్య నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు వైఎస్‌ సమాధి వద్ద అంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన అనేకమంది అభిమానులు కూడా వైఎస్‌ఆర్‌కు అంజలి ఘటించారు. మహానేత నాలుగవ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజలకోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆ ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన కళ్ల ముందు నుంచి దూరమయ్యారు. వైఎస్‌ఆర్‌ మన మధ్య నుంచి దూరమై నాలుగేళ్లు అయినా.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాయి. అందుకే వైఎస్‌ఆర్‌ ప్రజలకు దేవునిగా మారిపోయారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మహానేతకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి - పార్టీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ రక్తదానం చేశారు. వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement