`రాజకీయాల్లో విలువలు పడిపోయాయి: వైఎస్ జగన్
చిత్తూరు: విశ్వసనీయత, నిజాయితీకి నేడు రాజకీయాల్లో విలువలు పడిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి నాలుగేళ్లు అయిన ఆయన ప్రజల గుండెల్లోనే ఉన్నారని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ కొనసాగిస్తున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం దామినేడు సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయమంటే పదవి, ఓట్ల కోసం, సీట్ల కోసం అడ్డగోలుగా విభజించడం కాదన్నారు. ప్రతి పేదవాడు ఎదగాలని రాజకీయనాయకులకు తెలియాలని జగన్ హితువు పలికారు. గుణగణాలన్నా ఒక్కరే సీఎం అవుతారని ఆయన చెప్పారు. మరికొందరు అధికారం కోసం ఏ గడ్డైనా తింటారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మామని దింపి సీఎం అయిన తర్వాత ఏనాడైనా రైతులకు గాని, చదువుకుంటున్న విద్యార్థులకు గాని తన పాలనలో చేసిందేంటో చెప్పగలడాని జగన్ ప్రశ్నించారు. మరో నాలుగు నెలల్లో రాజన్న రాజ్యం తీసుకువస్తానని జగన్ చెప్పగలడు మరీ చంద్రబాబునాయుడు చంద్రన్న రాజ్యన్ని తెస్తానని చెప్పగలడా ? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ప్రజల్లోకి చంద్రబాబు వెళ్తే గుడ్లు, టమాటోలతో కొడతారని అన్నారు. సీఎం అవడానికి ముందు ఇస్తున్న రెండు రూపాయల బియ్యాన్ని రూ.5కు పెంచిన ఘనత చంద్రబాబుదు కాదా అన్నారు. మద్యంపాన నిషేదం చేసి ఈనాడులో వార్తలు రాయించుకొని బెల్టుషాపులు కూడా తెరిపించిన ఘనత చంద్రబాబుది కాదా ? అని జగన్ ప్రశ్నించారు. అక్కా చెల్లెల్ల దగ్గర రూ.1.50 వడ్డీ వసూలు చేయలేదాని అన్నారు. ఇప్పుడు అధికారం కోసం రుణమాఫి అని, ఉచిత విద్యుత్ అని చెబుతున్నారని జగన్ దుయ్యబట్టారు. రైతన్నల ఆత్మహత్యలను అపహస్యం చేయలేదాని జగన్ విమర్శించారు. రూ.ఇస్తానన్నా చంద్రబాబు ఏనాడైనా పది పైసలైనా ఇచ్చాడా అన్నారు. విశ్వసనీయతను తన తండ్రి నుంచి తాను వారసత్వంగా పొందానని జగన్ చెప్పారు. ఏడమ చెత్తో సీమాంధ్ర ఎమ్మెల్యేలను, కుడి చేత్తో తెలంగాణ ఎమ్మెల్యేలను చంద్రబాబు రెచ్చగొట్టడం లేదా అని జగన్ విమర్శించారు. 44 రోజుల అసెంబ్లీ చర్చల్లో ఏనాడైనా ధరల మీద చర్చ జరిగిందానని అన్నారు. మనమంతా ఒకటై చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుద్దామని వైఎస్ జగన్ చెప్పారు.