‘శంఖారావానికి’ మద్దతు ఇవ్వండి
Published Sun, Dec 1 2013 3:07 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
బెలగాం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి చేపడుతున్న సమైక్య శంఖారావానికి నాయకులు, కార్యకర్తలు మద్దతు పలకాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రసన్నకుమార్, ఉదయభాను పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని రాజశేఖరరెడ్డి, తెలుగుతల్లి విగ్రహా లకు వారు పూలమాలలు వేసి,నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనని స్పష్టం చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ శ్రీనివాసరావు, యువజన విభాగం కన్వీనర్ వెంకటేష్, మం డల కన్వీనర్ చుక్క లక్ష్ముంనాయుడు, పాల్గొన్నారు.
బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలి
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రైవేట్ భవనంలో పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ, ప్రతి వార్డుకూ పది నుంచి 15 మం దితో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్, చుక్క లక్ష్ముంనాయుడు, కేతిరెడ్డి రాఘవకుమార్, బాలమురళీకృష్ణ, రవికుమార్, షఫి , ఎస్‌వీఎస్‌ఎన్ రెడ్డి, పాల్గొన్నారు.
Advertisement
Advertisement