'సోనియా' డ్రామాలో కిరణ్, బాబు పాత్రలు | Y S Jagan mohan reddy takes on congress party | Sakshi
Sakshi News home page

'సోనియా' డ్రామాలో కిరణ్, బాబు పాత్రలు

Published Tue, Jan 28 2014 11:43 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

'సోనియా' డ్రామాలో కిరణ్, బాబు పాత్రలు - Sakshi

'సోనియా' డ్రామాలో కిరణ్, బాబు పాత్రలు

పేద ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచి ఉన్నారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగలో మాట్లాడుతూ... వైఎస్ఆర్ పరిపాలించిన సువర్ణయుగం త్వరలో రాష్ట్రంలో రానుందన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

 

యూపీఏ ఆడించే డ్రామాలో సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు పాత్రదారులని ఎద్దేవా చేశారు. ఆమాయక ప్రజలతో సీఎం కిరణ్ ఆటలు ఆడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజల సంక్షేమ పథకాలు అటకెక్కాయన్నారు. వంట గ్యాస్ ధరలు ఆకాశానంటాయని, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే భయపడిపోయే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement