సమైక్య శంఖారావానికి జన ప్రవాహం | Impeccable arrangements made for Jagan’s Sankharaavam Impeccable arrangements made for Jagan’s Sankharaavam | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 26 2013 11:14 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదం హోరెత్తింది. వర్ష బీభత్సం వారి ‘సమైక్యాంధ్ర’ ఆకాంక్షను నీరుగార్చలేకపోయింది. ఇళ్లు, పొలాలను ముంచెత్తిన వరద వారిని సమైక్యాంధ్ర ఉద్యమపథం నుంచి పక్కకు మళ్లించలేకపోయింది.అందుకే.. ప్రకృతి ప్రకోపాన్ని కూడా లెక్క చేయకుండా భావితరాల బాగు కోసం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సమష్టిగా హైదరాబాద్కు కదం తొక్కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్రం నలు మూల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, వివిధ వాహనాల ద్వారా సమైక్యవాదులు హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమైక్య శంఖారావం సభ మొదలవుతుంది.అయితే ఇప్పటి నుంచి సమైక్యవాదులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.మరోవైపు సమైక్య సభకు పెద్దఎత్తున ఉద్యోగులు, కార్మిక సంఘాల మద్దతు తెలిపాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement