లక్ష మందితో ఎన్నికల శంఖారావం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 3న ఏలూరులో నిర్వహించే ఎన్నికల శంఖారావం సభకు లక్షమంది ప్రజ లు తరలి వస్తారని పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తో ట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేఆళ్ల నాని చెప్పారు.
సభ నిర్వహించే అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద ఏర్పాట్లను శుక్రవారం వారిద్దరూ పరిశీలించారు. సభావేదిక, ప్రజలు కూర్చునేందుకు వీలుగా కుర్చీల ఏర్పా టు, తాగునీటి సౌకర్యం వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా విలేకరులతో చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పూరించనున్న ఎన్నికల శంఖారావాన్ని విజయవంతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామన్నారు. దీనిని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ఈనెల 3న విమానంలో బయలుదేరి గన్నవరం ఎరుుర్పోర్టుకు చేరుకుంటారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలుకుతారన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్మోహన్రెడ్డి ఏలూరు చేరుకుంటారని వివరించారు.
నగరంలో బహిరంగ సభ అనంతరం పార్టీ అధినేత నిడదవోలు బయలుదేరి వెళతారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్ జగన్ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్ర జలు తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ, 3 పార్లమెంటరీ స్థానాలను కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల సంక్షే మం కోసం చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సభా వేదిక నుంచి ప్రజలకు వివరిస్తారన్నారు. వారివెంట పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు బొద్దాని శ్రీనివాస్, వగ్వాల అచ్యుత రామారావు, నగర శాఖ కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మండల శాఖ కన్వీనర్ మంచెం మైబాబు, మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.