డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు | YSRCP leaders met DG of Police | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు

Published Fri, Oct 4 2013 6:40 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

YSRCP leaders met DG of Police

ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించదలచిన సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు డీజీపీ ప్రసాద్ రావును కోరారు. శుక్రవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, గట్టు రామచంద్రరావు తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. స్థానిక డీసీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని డీజీపీ చెప్పినట్టు తెలిపారు.

 వైఎస్‌ఆర్‌ సీపీ శాంతియుత పంథాలోనే పయనిస్తోందని గట్టు రామచంద్రరావు అన్నారు. గత మూడేళ్లుగా ఎక్కడ పర్యటించినా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని జూపూడి చెప్పారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు డీజీపీని కలసి సభకు అనుమతి ఇవ్వరాదని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement