ఈ ప్రాంత వెనకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని కడపలో ఏర్పాటు చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ ప్రాంత వెనకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని కడపలో ఏర్పాటు చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను వేధించినా ఫర్వాలేదని, రాజధాని విషయంలో ప్రజలను మాత్రం వేధించొద్దని ఆయన అన్నారు. కడప రాజధానిని చేస్తామంటే, అవసరమైతే తామంతా రాజీనామా చేస్తామని ఆదినారాయణరెడ్డి అన్నారు.
కాగా మరోవైపు కడపలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీకి నిరసన సెగలు గట్టిగా తగిలాయి. రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు సమీక్షా సమావేశాల్లోకి దూసుకెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు తక్షణమే ప్రకటించాలని, ఇన్నాళ్లూ జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సరిచేయాలని డిమాండ్ చేశారు. అభిప్రాయ సేకరణను వారు తీవ్రంగా అడ్డుకున్నారు.