సాక్షి వైఎస్సార్ జిల్లా: జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది. ఆర్టీపీపీ వద్దకు జేసీ వాహనాలను ఆది వర్గం అనుమతించడం లేదు. దీంతో తాడిపత్రి సిమెంట్ కంపెనీల వద్ద జమ్మలమడుగు వాహనాలను అడ్డగించారు. జమ్మలమడుగు వాహనాలకు లోడింగ్ చేయొద్దని జేసీ వర్గం హుకుం జారీ చేసింది. ఆర్టీపీపీ వద్ద జేసీ వాహనాలకు లోడింగ్ చేయొద్దని ఆది వర్గం చెబుతోంది. ఇరువురి నేతల మధ్యలో ట్రాన్స్‌పోర్ట్ యాజమానులు నలిగిపోతున్నారు. జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కాగా, అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి.
తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment