సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాలో ఏర్పాటు చేసిన జడ్పీ సర్వసభ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్యపై జరిగిన చర్చలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాచమల్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంతో ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఒక వేళ చంద్రబాబు ఓడిపోతే పోటీ నుంచి తప్పుకుంటారా అని మంత్రికి రాచమల్లు సవాల్ చేశారు.
సవాల్‌ను స్వీకరించని మంత్రి ఆదినారాయణ ఎమ్మెల్యే రాచమల్లుపై బెదిరింపులకు దిగారు. ‘మీ ఊరికే వస్తున్నా, మీ కథ చూస్తా. వేచి ఉండండి’ అంటూ రాచమల్లుపై మడ్డిపడ్డారు. అయితే బెరింపులకు భయపడేది లేదని, ప్రజలు తోడుగా ఉన్నంత వరకూ ఎంత మంది వచ్చినా తనను ఏమి చేయలేరని రాచమల్లు పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని ఎమ్మెల్యే రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment