
నెరవేరిన వైఎస్ఆర్ కల
కడప(వైఎస్‌ఆర్ జిల్లా): గండికోట రిజర్వాయర్‌కు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గండికోట రిజర్వాయర్ పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మండలాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు కొండాపురం మండలం గండికోటలో ఈ రక్షిత మంచీనీటి పథకం(గండికోట రిజర్వాయర్)ను నిర్మించారు.
నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నీటి విడుదలతో వైఎస్‌ఆర్ కల నెరవేరిందన్నారు. ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు.